breaking news
Anti-Cholesterol Drug
-
కొవ్వు కరిగించే మందుతో కరోనా కట్టడి!
లండన్: రక్తంలో అసాధారణ స్థాయిలో ఉన్న కొవ్వు పదార్ధాలను తొలగించేందుకు వాడే ఒక మందు కరోనా వైరస్‌ను 70 శాతం వరకు కట్టడి చేస్తోందని తాజా అధ్యయనం తెలిపింది. యూకేలోని బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో కొవ్వు తగ్గించేందుకు వాడే ఫీనోఫైబ్రేట్ ఔషధం కోవిడ్19 వైరస్ ఇన్ఫెక్షన్ను బాగా తగ్గిస్తున్నట్లు తెలిసింది. వైరస్ వ్యాప్తిని కరోనా తీవ్ర ప్రభావాన్ని ఫీనో ఫైబ్రేట్ తగ్గిస్తున్నట్లు తేలిందని పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎలిసా విసెంజి చెప్పారు. ఈ మందును రక్తంలో కొవ్వు తగ్గించేందుకు వాడతారు. నోటి ద్వారా తీసుకునే ఈ మందు ప్రపంచవ్యాప్తంగా చౌకగానే లభిస్తోందని, దీనివల్ల దుష్పరిణామాలు తక్కువేనని ఎలిసా చెప్పారు. కరోనాపై దీని వాడకానికి ముందు క్లీనికల్ ట్రయిల్స్ జరపాలని, ట్రయిల్స్‌లో సత్ఫలితాలు వస్తే అల్పాదాయ దేశాలకు వరంగా ఈ మందు మారుతుందని చెప్పారు. టీకా తీసుకోవడం కుదరని వారికి ఈ ఔషధం ఉపయుక్తంగా ఉంటుందన్నారు. రక్తంలో ఫ్యాట్ కంటెంట్ తగ్గించేందుకు ఈ మందు వాడవచ్చని యూఎస్ ఎఫ్డీఏతోపాటు పలు దేశాల ఔషధ నియంత్రణా సంస్థలు అనుమతినిచ్చాయి. మనిషి కణాల్లోకి కరోనా ప్రవేశాన్ని కల్పించే చర్యను ఈ ఔషధం సమర్ధవంతంగా అడ్డుకుంటున్నట్లు తాజా పరిశోధన వెల్లడిస్తోంది. దీని ఆధారంగా కరోనాపై ఫీనోఫైబ్రేట్ ప్రభావాన్ని అధ్యయనం చేసే క్లీనికల్ ట్రయిల్స్ ప్రస్తుతం యూఎస్, ఇజ్రాయిల్‌లో జరుగుతున్నాయి. అలాగే డెల్టా వేరియంట్‌పై ఈ ఔషధ ప్రభావాన్ని గుర్తించేందుకు సైతం పరిశోధనలు జరుగుతున్నాయి. చదవండి : Women's Hockey: కన్నీరు మున్నీరైన అమ్మాయిలు, అనునయించిన మోదీ -
యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్‌పై సన్ ఫార్మాకు అనుమతి
న్యూఢిల్లీ: దేశీ హెల్త్‌కేర్ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్ జెనెరిక్ వెర్షన్ టాబ్లెట్ కు ఆమోదం పొందింది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగించే జెటియా జెనెరిక్ వెర్షన్ ఎజిటిమీబీ మాత్రలకు యూఎస్ఎఫ్డీఏ అనుమతి లభించింది. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలను తగ్గించేందుకు వినియోగించే జెటియా ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు తాజాగా అనుమతి లభించినట్లు కంపెనీ పేర్కొంది. సన్ ఫార్మా బిఎస్ఇ ఫైలింగ్ లోతెలిపింది. 10 మి.గ్రా. మాత్రలకు తుది ఆమోదం పొందినట్టు చెప్పింది. దీంతో సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ స్టాక్ బిఎస్ఇలో 1.19 శాతం పెరిగింది.