యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్పై సన్‌ ఫార్మాకు అనుమతి | Sun Pharma Receives US Drug Regulator Nod For Anti-Cholesterol Drug | Sakshi
Sakshi News home page

యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్పై సన్‌ ఫార్మాకు అనుమతి

Jun 13 2017 2:26 PM | Updated on Apr 4 2019 5:12 PM

దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్ జెనెరిక్ వెర్షన్ టాబ్లెట్‌కు ఆమోదం పొందింది.

న్యూఢిల్లీ:  దేశీ హెల్త్‌కేర్‌ దిగ్గజం  సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అమెరికా హెల్త్ రెగ్యులేటర్ నుంచి యాంటీ-కొలెస్టరాల్ డ్రగ్  జెనెరిక్ వెర్షన్  టాబ్లెట్‌ కు ఆమోదం పొందింది. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించేందుకు ఉపయోగించే    జెటియా  జెనెరిక్ వెర్షన్  ఎజిటిమీబీ  మాత్రలకు  యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించింది.  

రక్తంలో కొలెస్టరాల్‌ స్థాయిలను తగ్గించేందుకు వినియోగించే జెటియా ట్యాబ్లెట్లను అమెరికా మార్కెట్లో విక్రయించేందుకు తాజాగా అనుమతి లభించినట్లు కంపెనీ పేర్కొంది.  సన్ ఫార్మా బిఎస్ఇ ఫైలింగ్‌ లోతెలిపింది.  10 మి.గ్రా. మాత్రలకు తుది ఆమోదం పొందినట్టు చెప్పింది.  దీంతో సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ స్టాక్ బిఎస్ఇలో  1.19 శాతం పెరిగింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement