ట్రంప్‌పై నెటిజన్లు ఫైర్‌, భాధ్యతలేకుండా...

Donald Trump Remove Mask After Discharge from Hospital - Sakshi

వాషింగ్టన్‌: కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయిన తరువాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం (అక్టోబర్ 5) ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి వైట్‌ హౌస్‌కు వచ్చారు. ఆయన ఫోటో కోసం మీడియా అడగగా ఆయన మాస్క్‌ తీసి ఫోటోకు ఫోజులిచ్చారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకోకుండానే ట్రంప్‌ ఇలా మాస్క్‌ తీయడం చూసి నెటిజన్లు   దిగ్భ్రాంతికి గురయ్యారు. ట్విట్టర్, ఇతర సోషల్ మీడియాలో ట్రంప్‌ ఫోటోలు అందుబాటులో ఉన్నారు.

వాటిలో ఆయన వైట్‌ హౌస్‌ వద్ద మెట్లు ఎక్కడం లాంటి ఫోటోలు ఉన్నాయి. అప్పుడు కూడా ట్రంప్‌ మాస్క్‌ తొలగించే ఉన్నారు. మాస్క్‌ లేకుండానే ట్రంప్‌ ఊపిరి పీల్చుకోవడం వదలడం లాంటివి చేస్తున్నారు. అయితే ఇది చూసిన ఒక నెటిజన్‌ మెట్లు ఎక్కే సమయంలో ట్రంప్‌ ఊపిరి పీల్చుకోవడం కష్టం కావడంతో మాస్క్‌ను తొలగించినట్లు కనిపిస్తోంది అని కామెంట్‌ చేశాడు. ఫోటో కోసం ట్రంప్‌ మాస్క్‌ తీసివేయడంపై నెటిజన్లు మండిపడుతున్నాడు. ఇలా చేయడం ద్వారా ట్రంప్‌ తన కుటుంబాన్ని, సిబ్బందిని కరోనా బారిన పడేలా చేశారు అంటూ మండిపడుతున్నారు. 

చదవండి: ట్రంప్‌ ఓకే- యూఎస్‌ మార్కెట్లు అప్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top