ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్ | Donald Trump Key Remarks on the War | Sakshi
Sakshi News home page

ఇరాన్ ఆ విషయంలో హామీ ఇచ్చింది : ట్రంప్

Mar 25 2026 3:00 AM | Updated on Mar 25 2026 4:04 AM

Donald Trump Key Remarks on the War

పశ్చిమాసియా యుద్దంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ ట్రంప్ ఈ వివరాలు వెల్లడించారు.

పశ్చిమాసియా యుద్ధం తాత్కాలిక బ్రేక్ పడింది. అయితే  ఈ విషయంలో ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నామని అమెరికా తరచుగా చెబుతున్నప్పటికీ టెహ్రాన్‌ మాత్రం ఇప్పటి వరకూ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు ఈ నేపథ్యంలోనే ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడారు.

ట్రంప్ మాట్లాడుతూ "ప్రస్తుతం  ఇరాన్‌లో సరైన వ్యక్తులతో  మాట్లాడుతున్నాం వారు  ఒప్పందం చేసుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు ఈ చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్  మరియు విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco  పాల్గొంటున్నారు అని ఆయన తెలిపారు. అదేవిధంగా  ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని అంగీకరించిందని తెలిపారు.

అదేవిధంగా ఇరాన్‌పై అమెరికా చేసిన దాడుల వల్ల అక్కడి పాలనలో మార్పు జరగబోతుందని తెలిపారు. కాగా ఈ యుద్ధం ముగిసినట్టేనా?: ఇరాన్‌తో శాంతి ఒప్పందం ఎంతవరకు సఫలమవుతుందని  ట్రంప్‌ను ప్రశ్నించగా.. "ఈ యుద్ధంలో విజయం సాధించాం" అని సమాధానమిచ్చారు. అయితే చర్చల విషయంలో ఇరాన్ ఇదివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Advertisement
 
Advertisement
Advertisement