ఈ ఫోటో ఖరీదు రూ.3.7 కోట్లు.. ఎందుకింత రేటు

Disaster Girl Zoe Roth Turns Her Meme Into 5,00,000 Dollars NFT - Sakshi

ఇల్లు కాలిపోతున్నప్పుడు ఒక చిన్న అమ్మాయి నవ్వుతూ దిగిన ఫోటోను ఇటీవల ఇంటర్నెట్ లో ఎన్‌ఎఫ్‌టీ ద్వారా విక్రయించడం వల్ల 5,00,000(సుమారు రూ. 3.7 కోట్లు) డాలర్లకు అమ్ముడు పోయింది. ఇంతకీ ఈ ఫోటోలో ఏముంది? దాన్ని ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారో తెలుసుకుందాం. జో రోత్​ అనే అమ్మాయి 2005లో తనకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒక కాలిపోతున్న భవనం ముందు నిల్చొని ఫోటో దిగింది. ఈ ఫోటోలో చూడటానికి నవ్వుతూ దెయ్యంగా ఉన్న ఫోటోను తన తండ్రి డేవ్​ రోత్​ తీశాడు.

అప్పుడు ఆ ఫోటోను తీసిన తన తండ్రికి గానీ, తనకు గానీ తెలియదు భవిష్యత్తులో కోట్లు తెచ్చిపెడుతుందని. జేపీజీ మ్యాగజైన్​ నిర్వహించిన ‘ఎమోషన్​ క్యాప్చర్​’ అనే కంటెస్ట్ వీరి జీవితాన్ని మార్చేసింది. జో రోత్​ తండ్రి ఈ పోటీకి తన కూతురు దిగిన ఫోటోను పంపించాడు. ఈ ఫోటో 2005 నుంచి అందరికీ ఫేవరెట్​గా నిలిచింది. అప్పటి నుంచి జో రోత్​ ‘డిజాస్టర్ గర్ల్’గా ఫేమస్​ అయ్యింది. అమెరికాకు చెందిన జో రోత్​ కి ప్రస్తుతం 21 సంవత్సరాలు. తను  యూనివర్సిటీ ఆఫ్​ కరోలినాలో చదువుతుంది. 

గతంలో ‘ఓవర్లీ ఎటాచ్డ్​ గర్ల్​ ఫ్రెండ్​’, ‘బ్యాడ్​ లక్​ బ్రియన్’​ వంటి ఫేమస్​ మీమ్స్​ లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయి. అది చూసిన తనకు కూడా పాత ఫోటోను అమ్మకానికి పెట్టాలని నిర్ణయించింది. తర్వాత తన తండ్రికి ఈ విషయం చెప్పింది. వారు ఒక లాయర్, మేనేజర్​ను కలిసి తమ ఆలోచనను పంచుకున్నారు. వారి సలహా మేరకు తన మీమ్​ ఒరిజినల్​ డిజిటల్​ కాపీని వేలం వేశారు. ఏప్రిల్ 16న ఈ ‘డిజాస్టర్​ గర్ల్​ మీమ్’​​ ఫోటోను 24 గంటలు వేలంలో పెట్టారు. అది ఏకంగా 5 లక్షల డాలర్లకు అమ్ముడుపోయింది. ఈ ఫోటోను దుబాయ్​ కేంద్రంగా పనిచేస్తున్న ‘3 ఎఫ్ మ్యూజిక్’ అనే మ్యూజిక్ ప్రొడక్షన్ కంపెనీ సీఈఓ ఫర్జిన్ ఫర్దిన్ ఫార్డ్ వేలంలో దక్కించుకున్నాడు. ఇందులో కొంత మొత్తం చారిటీకి, మిగతాది తన చదువులకు ఖర్చు చేయనున్నట్లు జో రోత్ పేర్కొంది.

చదవండి:

భారీ ధర పలికిన జాక్‌ తొలి ట్వీట్‌.. ఎంతో తెలుసా?

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags:  

Read also in:
Back to Top