కరోనాపై పోరులో కొత్తమందు!

Denmark Scientists Develop Molecules Blocks Covid Infection - Sakshi

లండన్‌: కోవిడ్‌ వైరస్‌ ఉపరితలాన్ని అతుకోవడం ద్వారా, సదరు వైరస్‌ మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే ఒక మాలిక్యూల్‌(ఔషధి, చిన్న సైజు ఆర్గానిక్‌ కాంపౌండ్‌)ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెన్మార్క్‌కు చెందిన ఆర్హస్‌ యూనివర్సిటీ సైంటిస్టులు ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. ఈ ఔషధి చౌకైనదని,  కోవిడ్‌పై పోరులో ఉపయోగపడే యాంటీ బాడీల ఉత్పత్తితో పోలిస్తే దీన్ని ఉత్పత్తి చేయడం తేలికన్నారు. పీఎన్‌ఏఎస్‌ జర్నల్‌లో పరిశోధనా ఫలితాలను మంగళవారం ప్రచురించారు.

చదవండి:  ప్రధాని మోదీని కలిసిన ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

ఈ మాలిక్యూల్‌ ఆర్‌ఎన్‌ఏ ఆప్టమర్స్‌ జాతికి చెందిన కాంపౌండ్‌ అని, ఎంఆర్‌ఎన్‌ఏ టీకాల తయారీలో ఉపయోగపడే బిల్డింగ్‌ బ్లాక్స్‌ దీనిలో ఉంటాయని తెలిపారు. 3డీ నిర్మితిలో మలిచేందుకు వీలయ్యే జన్యు పదార్ధం(డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏ)ను ఆప్టమర్‌ అంటారు. ఇవి నిరి్ధష్ట లక్షిత కణాలను కనుగొనే శక్తి కలిగి ఉంటాయి. ఈ మాలిక్యూల్‌ వైరస్‌ ఉపరితలానికి అతుక్కోగానే వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌ మానవ కణంలోకి ప్రవేశించకుండా నిరోధించడం జరుగుతుందని పరిశోధకులు తెలిపారు. దీన్ని కేవలం కోవిడ్‌ నిరోధానికే కాకుండా, గుర్తించడానికి వాడుకోవచ్చన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top