లేటు వయసులో దావూద్‌ ఘాటు ప్రేమ! | Dawood Ibrahim Upset Over Exposing His Relationship With Pak Actress | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ న‌టితో దావూద్ ప్రేమాయ‌ణం

Aug 26 2020 10:43 AM | Updated on Aug 26 2020 12:42 PM

Dawood Ibrahim Upset Over Exposing His Relationship With Pak Actress  - Sakshi

పాకిస్తాన్‌లో త‌ల‌దాచుకుంటున్న దావూద్ గ‌త మూడేళ్లుగా పాక్ సినీన‌టి మోహ్విష్ హయత్‌తో ప్రేమాయాణం నడుపుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇస్లామాబాద్ : అండ‌ర్ వ‌రల్డ్ డాన్‌, 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో ప్ర‌ధాన నిందితుడు దావూద్ ఇబ్ర‌హీం పాకిస్తాన్‌ సినీన‌టితో ప్రేమాయ‌ణం న‌డుపుతున్న‌ట్టుగా తెలుస్తోంది. ముంబైలో ఉన్న సమయంలోనూ  గ‌తంలో ఆయన పలువురు బాలీవుడ్ హీరోయిన్ల‌తో సంబంధాలు కొన‌సాగించిన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం పాకిస్తాన్‌లో త‌ల‌దాచుకుంటున్న  60 ఏళ్ల దావూద్ గ‌త మూడేళ్లుగా పాక్ న‌టి మోహ్విష్ హయత్‌తో ప్రేమాయాణం నడుపుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమెకు పాకిస్తాన్ ప్ర‌భుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే  'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డుకు 2019లో ఎంపికైంద‌ని ప‌లు క‌థ‌నాల్లో వెల్లడైంది. చిన్నా చిత‌కా పాత్ర‌లు పోషించే  మోహ్విష్‌కు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పుర‌స్కారం క‌ట్ట‌బెట్ట‌డంతో.. అస‌లు ఆమె ఎవ‌రు? ఏమేం సినిమాల్లో న‌టించింద‌న్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మోహ్విష్‌తో సంబంధాలపై  మీడియా క‌థ‌నాలు రావ‌డంపై దావూద్ ఆగ్ర‌హంగా ఉన్నట్లు తెలుస్తోంది. (పాక్‌లోనే దావూద్‌..!)

ఐటమ్‌ గాళ్‌గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ పేరు 2019లో అవార్డు రావ‌డంతో ఒక్క‌సారిగా మారుమోగిపోయింది. దీంతో పెద్ద సినిమాల్లోనూ ఈ 37 ఏళ్ల భామ‌కు అవ‌కాశాలు వ‌స్తున్నాయ‌ట‌. ఇదంతా దావూద్ సిఫార్సు వ‌ల్లేనని  అక్క‌డి మీడియా కోడైకూస్తోంది. ప్ర‌స్తుతం కరాచీలో అత్యంత లగ్జరీ బంగ్లాలో దావూద్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి మోహ్విష్ సైతం ఖ‌రీదైన బంగ్లాల్లో నివ‌సిస్తోందట. అంతేకాకుండా దావూద్ ప్రేయ‌సిగా చ‌లామ‌ణి అవుతూ ప‌లు పార్టీలను కూడా నిర్వ‌హిస్తోందట. కాగా, మోహ్విష్‌కు, దావూద్‌కు మ‌ధ్య 27 ఏళ్ల వ్య‌త్యాసం ఉంది. అయిన‌ప్ప‌టికీ లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ అంటూ ఈ జంటపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (సినిమాలపై దావూద్‌ ప్రభావం)

Advertisement
 
Advertisement
Advertisement