జిన్‌పింగ్‌ ప్రభుత్వంపై చైనా వాసుల ఆగ్రహం

Covid Struggle Wuhan Kin Said I Died Too With My Father - Sakshi

ప్రభుత్వం కోవిడ్‌ గురించి కప్పి పుచ్చే ప్రయత్నం చేసింది

మొదట్లో కరోనా కట్టడి, వ్యాప్తిని నిరోధించడంపై దృష్టి పెట్టలేదు

కేసులు లేకున్నా వుహాన్‌ వాసులను వదలని కోవిడ్‌ భయం

బీజింగ్‌: కోవిడ్‌ మహమ్మారి విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. ఎన్నో కుటుంబాల్లో కడుపుకోత మిగిల్చింది మహమ్మారి. నేటికి కూడా చాలా మంది ఆ బాధ నుంచి బయట పడలేకపోతున్నారు. ప్రేమించిన వారు దూరమవ్వడంతో వారిని మర్చిపోలేక.. ఒంటరిగా బతకలేక నరకం అనుభవిస్తున్నారు. వుహాన్‌ వాసి లియు పే తండ్రి కరోనా బారిన పడి మరణించాడు. తండ్రి చనిపోయిన నాటి నుంచి అతడు ఒంటరితనం అనుభవిస్తున్నాడు. ఇన్నాళ్లు లియు పేతో కలిసిన తిరిగిన స్నేహితులు, బంధువులు ప్రస్తుతం అతడిని తప్పించుకుతిరుగుతున్నారు. కారణం అతడి తండ్రి కరోనాతో చనిపోవడంతో.. లియుని కలవడం.. ఇంటికి ఆహ్వానించడం వంటివి చేస్తే.. తమకి కూడా ఇన్‌ఫెక్షన్‌ సోకుతుందనే అనుమానంతో వారు లియుకి దూరంగా ఉంటున్నారు. తండ్రి దూరమయ్యాడు.. బంధువులు, స్నేహితులు ఆదరించడం లేదు. దాంతో జీవితం పట్ల ఒక లాంటి నిర్లిప్తత భావం ఏర్పరుచుకున్నాడు లియు. ఇన్నాళ్ల నుంచి తాను చేస్తోన్న వ్యాపారాన్ని వదులుకున్నాడు. బుద్ధిజంలోకి మారాలని భావిస్తున్నాడు. 

కరోనా వైరస్‌ విజృంభణ మొదలై ఇప్పటికే ఏడాది పూర్తయ్యింది. మహమ్మారి వ్యాప్తి వుహాన్‌ నుంచి ప్రారంభమైంది. అయితే మొదట చైనా అధికారులు వైరస్‌ గురించి ఎలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వలేదు. అన్నింటి కంటే ముఖ్యమైనది ఇది మనిషి నుంచి మనిషికి వ్యాప్తిస్తుందనే విషయాన్ని దాచి పెట్టారు. దాంతో వుహాన్‌ వ్యప్తంగా దాదాపు 4 వేల మంది కోవిడ్‌ బారిన పడి మరణించారు. లియు పే తండ్రి కూడా కరోనా వైరస్‌ బారిన పడి చనిపోయాడు. లియు పే తండ్రి లియు ఓకింగ్‌ రెగ్యులర్‌ హెల్త్‌ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కరోనా వైరస్‌గా నిర్థారించారు. అయితే మొదట్లో మహమ్మారి తీవ్రత గురించి తెలియకపోవడంతో.. ప్రభుత్వ సిబ్బంది.. ఆస్పత్రి యాజమాన్యం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఈ ఏడాది జనవరి 29న అతడు మరణించాడు. అదే రోజున తాను మరణించానంటున్నాడు లియు పే. ఇక తండ్రి మరణం తర్వాత తాను పిచ్చివాడిగా మారిపోయానన్నాడు. వైరస్‌ గురించి ప్రభుత్వం దాచి పెట్టడం వల్లే తాను తండ్రితో పాటు జీవితాన్ని కోల్పోయానని ఆవేదనం వ్యక్తం చేస్తున్నాడు. చైనా ప్రభుత్వం మీద తనకు ఎంతో కోపంగా ఉండేదని.. ఒకానొక సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని భావించానని తెలిపాడు లియు. (చదవండి: కరోనాపై చైనా మరో కథ)

లియు పేతో పాటు చాలా మంది వుహాన్‌ వాసులు సోషల్‌ మీడియా వేదికగా జిన్‌ పింగ్‌ ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదం వల్ల తాము కుటుంబ సభ్యులను కోల్పోయి నరకం అనుభవిస్తున్నామని ఆరోపించారు. ఇక తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయిన లియు పే.. తన బాధను ఎవరు పట్టించుకోరు అని అర్థం చేసుకున్న తర్వాత తన కోపాన్ని బౌద్ధ మతం వైపు మళ్లించాడు. మందు, మాంసం, ఆల్కహాల్‌ను వదిలేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంతో తనకున్న సంబంధాలన్నింటిని తెంచుకున్నాడు. వ్యాపారన్ని కూడా త్యజించి.. బౌద్ధంలోకి మారాడు. ఇప్పడతని దృష్టిలో డబ్బుకి ఏ మాత్రం విలువలేదు. ఆధ్యాత్మిక అన్వేషణలో ఉన్న లియు జీవిత రహస్యం తెలుసుకునే పనిలో ఉన్నాడు. (చదవండి: యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది బలి)

ఇక ప్రస్తుతం వుహాన్‌లో కరోనా కేసులు ఏవి వెలుగు చూడనప్పటికి జనాల్లో మాత్రం భయం పోవడం లేదు. గతంలో వైరస్‌ బారిన పడి.. కోలుకున్న వారితో మాట్లాడాలంటే సందేహిస్తున్నారు జనాలు. వారితో కలవడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్యే వివాదాలు తలెత్తుతున్నాయి. వుహాన్‌కు చెందిన 36 ఏళ్ల యువతి తన తండ్రిని కోల్పోయింది. ఆ బాధ నుంచి కోలుకోలేకపోతుంది. ఇక వైరస్‌ గురించి.. చైనా ప్రభుత్వం దాన్ని కప్పిపెట్టిన విధానం గురించి ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించింది. బంధువులు, స్నేహితులు తనను దూరం పెట్టారనివాపోయింది. ‘జీవితం కొనసాగుతుంది.. కానీ అది మిగిల్చిన గాయాల తడి అలానే ఉంటుంది’. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

14-01-2021
Jan 14, 2021, 15:35 IST
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నా దేశంలో యూకే కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య పెరుగతుండటంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
14-01-2021
Jan 14, 2021, 14:01 IST
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కోవిడ్‌ టీకా డ్రైవ్‌ జనవరి 16 నుంచి ప్రారంభమవుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు....
14-01-2021
Jan 14, 2021, 05:35 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మంగళవారం 38,192 మంది నమూనాలను పరీక్షించగా, అందులో 331 మందికి...
14-01-2021
Jan 14, 2021, 04:45 IST
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్‌ యాప్‌లో ఇప్పటికే...
14-01-2021
Jan 14, 2021, 01:48 IST
భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాగ్జిన్‌ టీకా వేసుకునే లబ్ధిదారులు తప్పనిసరిగా అంగీకారపత్రం ఇవ్వాల్సి ఉంటుందని ..
13-01-2021
Jan 13, 2021, 17:43 IST
నిరాధారమైన ఆరోపణలు చేయడం విచారకరమని సోమ్‌ పేర్కొన్నారు.
13-01-2021
Jan 13, 2021, 14:42 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌  కేజ్రీవాల్‌   తనరాష్ట్రప్రజలకు తీపి కబురుఅందించారు. కేంద్రం ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్‌ ను ఉచితంగా ...
13-01-2021
Jan 13, 2021, 05:08 IST
న్యూఢిల్లీ/పుణే: ఈనెల 16వ తేదీన జరిగే దేశవ్యాప్త కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరిగి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సోమవారం...
13-01-2021
Jan 13, 2021, 03:23 IST
సాక్షి, అమరావతి/గన్నవరం: రాష్ట్రానికి కోవిడ్‌ టీకా వచ్చేసింది. గన్నవరం విమానాశ్రయానికి కోవిడ్‌ టీకా బాక్సులు చేరుకున్నాయి. సీరం ఇన్‌స్టిట్యూట్‌కు సంబంధించిన...
12-01-2021
Jan 12, 2021, 16:44 IST
ప్రభుత్వ మెగా టీకా డ్రైవ్‌లో అందించే కోవిషైల్డ్ వ్యాక్సిన్ ధరపై స్పందించిన అదర్‌ పూనావాలా మొదటి 100 మిలియన్ మోతాదులకు మాత్రమే  200 రూపాయల ప్రత్యేక ధరకు అందించామన్నారు. ...
12-01-2021
Jan 12, 2021, 09:51 IST
ముంబై: ఏడాది పాటుగా కరోనా వైరస్‌తో కకావికాలమైన దేశం మరి కొద్ది రోజుల్లో ఊపిరి పీల్చుకోనుంది. వైరస్‌ని ఎదుర్కొనే కోవిడ్‌...
12-01-2021
Jan 12, 2021, 09:50 IST
ప్రాణాంతక కరోనా మహమ్మారి చైనాలోనే పుట్టిందని ప్రపంచవ్యాప్తంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
12-01-2021
Jan 12, 2021, 05:44 IST
సాక్షి, హైదరాబాద్‌: ‘ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ను అన్ని పీహెచ్‌సీల పరిధిలో ప్రారంభించడానికి అవసరమైన...
12-01-2021
Jan 12, 2021, 05:39 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వ్యాక్సిన్లు ఏమాత్రం పక్కదారి పట్టకుండా ఉండేందుకు, బ్లాక్‌ మార్కెట్లకు తరలకుండా ఉండటానికి గట్టి నిఘా పెట్టాలని...
12-01-2021
Jan 12, 2021, 04:46 IST
న్యూఢిల్లీ: కేంద్ర వార్షిక బడ్జెట్‌ ప్రతులను పార్లమెంట్‌ సభ్యులకు ఈసారి డిజిటల్‌ రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌...
12-01-2021
Jan 12, 2021, 04:25 IST
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ దిశగా కీలక పరిణామం...
12-01-2021
Jan 12, 2021, 04:18 IST
న్యూఢిల్లీ: కరోనా టీకాను తొలిదశలో 3 కోట్ల మందికిపైగా ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు అందజేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర...
11-01-2021
Jan 11, 2021, 17:31 IST
సాక్షి, న్యూఢిల్లీ: జనవరి 16వ తేదీనుంచి కరోనా వైరస్‌ మహమ్మారికి అంతానికి దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ షురూ కానున్న నేపథ్యంలో కేంద్రం...
11-01-2021
Jan 11, 2021, 12:17 IST
కరోనా వైరస్‌ మహమ్మారి అమెరికాలో పురుషులతో పోలిస్తే  ఉపాధిని కోల్పోయిన వారిలో మహిళలే ఎక్కువ ఉన్నారు.
11-01-2021
Jan 11, 2021, 05:04 IST
లండన్‌ : బ్రిటన్‌ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్‌ ఫిలిప్‌కు కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ ఇచ్చారు. విండ్సర్‌ కేజల్‌లో ఉంటున్న...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top