చైనాలో దడపుట్టిస్తున్న కొత్తరకం స్రెయిన్‌ 

Corona New Strain Giving Terror To Officials In Guangzhou City Of China - Sakshi

బీజింగ్‌: కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనాలోని  గాంజావ్‌ సిటీలో కొత్త రకం స్ట్రెయిన్ దడపుట్టిస్తుంది. మునుపటి స్ట్రెయిన్‌లతో పోల్చితే ఈ స్ట్రెయిన్ మరింత ప్రమాదకరమని తేలడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 1.5 కోట్ల మంది నివాసముండే గాంజావ్‌ సిటీలో గత వారం రోజుల్లో 20 మందిలో ఈ కేసులు బయటపడ్డట్లు తెలుస్తోంది. తాజాగా బయటపడిన కేసుల్లో వేరియంట్‌ చాలా ప్రమాదకరంగా ఉన్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ పత్రిక ఒక కథనంలో రాసుకొచ్చింది.

దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గాంజావ్‌ ప్రాంతంలో  కఠిన ఆంక్షలు విధించింది. తదుపరి  ఆదేశాల వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించింది. తమ దేశంలో కరోనాను కట్టడి చేశామంటూ గొప్పగా చెప్పుకుంటున్న ఈ సమయంలో మళ్లీ పదుల సంఖ్యలో కరోనా కేసులు విజృంభిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. కరోనా కొత్త వేరియంట్ బయటపడడంతో దీని వ్యాప్తిని తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త వేరియంట్‌ అన్వేషణలో భాగంగా లివాన్‌ జిల్లాలోని 5 ప్రాంతాల్లో ప్రజలకు పరీక్షలు నిర్వహించనుంది. 
చదవండి: మరోముప్పు.. కరోనా హైబ్రిడ్‌

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top