చైనాను వణికిస్తున్న ఇన్‌ఫ్లూయెంజా.. భారీగా పెరిగిన కేసులు.. కరోనా తరహా లాక్‌డౌన్లు..

China Influenza Outbreak Covid Like Lockdowns As Cases Rise - Sakshi

బీజింగ్‌: ఇన్‌ఫ్లూయెంజా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న కారణంగా చైనా హడలెత్తిపోతోంది. దీంతో నివారణ చర్యగా జియాన్ నగరంలో కరోనా లాక్‌డౌన్ తరహా ఆంక్షలు విధిస్తున్నారు అధికారులు. గత వారంతో పోల్చితే పాజిటివిటీ రేటు 25.1 శాతం నుంచి 41.6 శాతానికి పెరిగినట్లు చైనా అంటువ్యాధుల నియంత్రణ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు కోవిడ్ పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి పడిపోయింది.

ఇన్‌ఫ్లూయెంజా వ్యాప్తిని నియంత్రించేందుకు కరోనాకు తీసుకున్న చర్యలే తీసుకుంటామని అధికారులు తెలిపారు. స్కూళ్లు, వ్యాపార కార్యకాలాపాలు మూసివేస్తున్నట్లు వెల్లడించారు. జియాన్ నగరంలో దాదాపు 1.3 కోట్ల మంది నివసిస్తున్నారు. అధికారుల లాక్‌డౌన్‌ నిర్ణయాన్ని వీరు వ్యతిరేకిస్తున్నారు. 

లాక్‌డౌన్ విధించడం కంటే వ్యాక్సిన్ ఇవ్వడం ఉత్తమమని జియాంగ్ నగరవాసులు చెబుతున్నారు. వ్యాపార కార్యకలాపాలు నిలిపివేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
చదవండి: లైవ్ మ్యూజిక్‌ షోలో పాడుతూ కుప్పకూలిన సింగర్.. 27 ఏళ్లకే..

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top