బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు హాజరై చిక్కుకుపోయిన 70వేల మంది | Sakshi
Sakshi News home page

బర్నింగ్‌ మ్యాన్‌ ఫెస్టివల్‌కు హాజరై చిక్కుకుపోయిన 70వేల మంది

Published Sun, Sep 3 2023 9:21 PM

Burning Man storm traps 70000 revellers in Nevada - Sakshi

బర్నింగ్‌మ్యాన్‌ ఫెస్టివల్‌.. ఇది అమెరికాలోని ఎడారిలో నిర్వహించే అతిపెద్ద ఫెస్టివల్‌. ఈ ఫెస్టివల్‌ నిర్వహించే క్రమంలో 70 వేల మంది ఎడారిలో చిక్కుకుపోయారు. ఎడారిలో అతి భారీ వర్షం కురవడంతో వేల సంఖ్యలో ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు.. వర్షం కారణంగా ఎడారి అంతా బురద మయంగా మారడంతో ఎవరూ కూడా అక్కడ నుంచి బయటపడలేని పరిస్థితులు తలెత్తాయి. 

నెవడాలోని బ్లాక్‌రాక్‌ ఎడారి వర్షం కారణంగా పూర్తిగా చిత్తడిగా మారిపోయి అంతా బురద మయం అయిపోయింది. దాంతో ఆ ఫెస్టివల్‌కు హాజరైన సుమారు 70వేలకు పైగా ప్రజలు అక్కడ చిక్కుకుపోయారు. కొన్ని మైళ్ల దూరం వరకూ ఎటువైపు చూసినా బురదే కనిపిస్తోంది.  నడుస్తుంటే కాళ్లు బురదలో కూరుపోవడంతో ఎటూ కదల్లేని పరిస్థితి కనిపిస్తోంది.

ప్రస్తుతం అక్కడ వాహనాలకు అనుమతి నిరాకరించడంతో సందర్శకులు అక్కడే ఆహారం, నీరు సమర్చుకుని పొడిగా ఉన్న ప్రదేశంలో తలదాచుకోవాలని అధికారులు తెలిపారు. గత నెల 27వ తేదీన బర్నింగ్‌ మ్యాన్‌ ఫెప్టివల్‌ మొదలు కాగా, ఆ తర్వాత ఈ ప్రదేశాన్ని హరికేన్‌ తాకింది. దాంతో భారీ వర్షం కురిసి ఆ ప్రాంతం బురద మయంగా మారిపోయింది. ఒక్కరాత్రిలోనే నెలలకు పైగా కురవాల్సిన వర్షం కురవడంతో ఆ ప్రాంతమంతా స్తంభించిపోయింది.  కొంతమంది బురదలోనే అక్కడ నుంచి బయటపడేందకు యత్సిస్తున్నా పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు.

Advertisement

తప్పక చదవండి

Advertisement