కొత్త చరిత్ర సృష్టించిన బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2

Britain Queen Elizabeth II becomes world second-longest reigning monarch - Sakshi

అత్యధిక కాలం పాలించిన లిస్టులో రెండో స్థానం

లండన్‌: బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 (96) ఆదివారం కొత్త చరిత్ర సృష్టించారు. అత్యధిక కాలం పాలించిన వారి జాబితాలో థాయ్‌లాండ్‌ మాజీ పాలకుడు భూమిబల్‌ అతుల్యతేజ్‌ను వెనక్కు నెట్టి రెండో స్థానంలో నిలిచారు. భూమిబల్‌ 1927 నుంచి 2016 మధ్య 70 ఏళ్ల 126 రోజులు రాజుగా ఉన్నారు. ఆమె ఇంకో రెండేళ్లు పదవిలో కొనసాగితే ఫ్రాన్స్‌ లూయి–14ని కూడా దాటేసి తొలి స్థానంలో నిలుస్తారు. లూయి–14 1643 నుంచి 1715 దాకా 72 ఏళ్ల 110 రోజులు ఫ్రాన్స్‌ను పాలించారు. ఎలిజెబెత్‌–2 1953లో సింహాసనమెక్కారు.

బ్రిటన్‌ను అత్యధిక కాలం పాలించిన క్వీన్‌ విక్టోరియా రికార్డును 2015 సెప్టెంబర్‌లో అధిగమించారు. ఆమె పాలనకు 70 ఏళ్లు నిండిన సందర్భంగా వారం రోజులుగా ఇంగ్లండ్‌లో ఘనంగా వేడుకలు జరుగుతున్న విషయం తెలిసిందే. అనారోగ్యంతో వాటిలో పాల్గొనలేకపోయిన రాణి ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు వారిని ఉద్దేశించి ఆదివారం ఆమె లేఖ విడుదల చేశారు. ‘‘ఒక రాణి 70 ఏళ్లు పాలిస్తే సంబరాలు చేసుకోవాలంటూ నిజానికి రూలేమీ లేదు. అయినా మీరే చొరవ తీసుకొని ఇంత భారీగా వేడుకలు జరపడం నన్ను ఆనం దోద్వేగాలకు లోనుచేసింది’’ అని పేర్కొన్నారు.
చదవండి: ఉక్రెయిన్‌లో హోరాహోరీగా యుద్ధం.. మరో నాలుగు నెలలు:

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top