పెళ్లిలో భర్త పర్మిషన్‌తో లవర్‌ని..

Bride Asks for Husband Permission to Hug Ex Boyfriend at Their Wedding - Sakshi

జకార్తా: ప్రేమించిన వారంతా పెళ్లి చేసుకోవాలని లేదు. వేర్వేరు కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం.. వేరే వ్యక్తులతో వివాహం కావడం సాధారణంగా జరుగుతుంది. ఇక ఇలాంటి పెళ్లికి మాజీ ప్రియుడు, గర్ల్‌ ఫ్రెండ్‌ వస్తే.. ఆ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇక వారి ఎదుటే మరో వ్యక్తిని జీవిత భాగస్వామిగా అంగీకరించడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో మాటల్లో వర్ణించలేం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే ఓ యువతికి ప్రేమించిన వ్యక్తితో కాకుండా మరోకరితో వివాహం జరిగింది. మాజీ ప్రియుడు ఆ పెళ్లికి హాజరయ్యాడు. దాంతో యువతి భర్త అనుమతితో అతడిని హగ్‌ చేసుకుంది. ఇండోనేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. వివరాలు.. ఈ వీడియోలో ఓ యువతికి ప్రేమించి వ్యక్తితో కాకుండా మరొకరితో వివాహం అవుతుంది. ఇక ఈ వేడుకకి ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్‌ హాజరవుతాడు. అతడు వేదిక మీదకు ఎక్కి నూతన దంపతులకు శుభాకాంక్షలు చెప్పాలని భావిస్తాడు. తన మాజీ గర్ల్‌ ఫ్రెండ్‌కి షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలనకుంటాడు. కానీ ఆమె అతడికి చేయి ఇవ్వకుండా.. భర్త వైపు చూసి.. ఒక్కసారి నేను తనను హగ్‌ చేసుకోవచ్చా అని అడుగుతుంది.
(చదవండి: దట్టమైన సుడిగాలిలో క్రికెట్)

ఊహించని ఈ సంఘటనకి వరుడు తొలుత షాక్‌ అయినా.. ఒప్పుకుంటాడు. దాంతో వధువు తన మాజీ ప్రియుడిని హత్తుకుంటుంది. ఆ తర్వతా సదరు వ్యక్తి వరుడికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి.. హగ్‌ చేసుకుని అభినందనలు తెలపుతాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక నెటిజనలు వధువును విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘‘నీ భర్త ఎంత మంచి వాడైనా.. మరీ ఇలా అతడి ముందే.. తన అనుమతితోనే హగ్‌ చేసుకోవడం దారుణం’’.. ‘‘నీవ్వు అతడి భార్యగా తగవు’’.. ‘‘బ్రో నీ కళ్లు నిజం చేప్తున్నాయి... నీ భార్య ప్రవర్తన నిన్ను బాధపెట్టింది’’.. ‘‘భర్త ముందే మాజీ ప్రియుడ్ని హగ్‌ చేసుకున్నావ్‌.. నీకు అతడంటే ఏ మాత్రం గౌరవం లేదు’’ అంటూ విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top