వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం  | Blue Ghost captures lunar eclipse in space as Moon | Sakshi
Sakshi News home page

వినువీధి నుంచి చంద్ర గ్రహణ వీక్షణం 

Feb 3 2025 4:23 AM | Updated on Feb 3 2025 4:23 AM

Blue Ghost captures lunar eclipse in space as Moon

కెమెరాలో బంధించిన బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ 

టెక్సాస్‌: చంద్రగ్రహణాన్ని భూమి నుంచి చూశారు. అయితే అత్యంత దగ్గరగా, అది కూడా ఆకాశం నుంచి చూశారా? లేదు కదా. అయితే వచ్చే నెలలో చంద్రునిపై దిగనున్న బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ చంద్రగ్రహణాన్ని అత్యంత సమీపం నుంచి చూపించి అబ్బురపరిచింది. అది తాజాగా తీసిన చంద్రగ్రహణం ఫొటోలను జతకూర్చి వీడియోగా కూర్చి ల్యాండర్‌ తయారీదారు ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. ఈ వీడియో తెగ వైరలవుతోంది. 

ల్యాండర్‌ ప్రస్తుతం అంతరిక్షంలో భూ సమీప కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రగ్రహణం ఫొటోలను తన 6.6 అడుగుల ఎత్తయిన డెక్‌ నుంచి కెమెరాలో బంధించింది. సూర్యకిరణాల వల్ల ఏర్పడిన తన నీడతో భూమి చంద్రుడిని కప్పేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనువిందు చేస్తున్నాయి. చంద్రునిపై నాసా పరిశోధనలకు పరికరాలను మోసుకెళ్లేందుకు ‘కమర్షియల్‌ లూనార్‌ పేలోడ్‌ సరీ్వసెస్‌’ ప్రాజెక్టులో భాగంగా జనవరి 15న అమెరికాలోని కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బ్లూ ఘోస్ట్‌ ల్యాండర్‌ను ప్రయోగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement