చైనా సంచలన నిర్ణయం..

Beijing Says Residents Can Go Mask Free - Sakshi

13 రోజులుగా కేసులు లేవు.. మాస్క్‌ అవసరం లేదు

బీజింగ్‌: చైనా ఆరోగ్య శాఖ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు ప్రపంచ దేశాలన్ని కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి మాస్క్‌ ధరించడం తప్పనిసరి అంటుండగా.. డ్రాగన్‌ దేశం మాత్రం ఇక మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదంటుంది. ఈ మేరకు చైనా ఆరోగ్య శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక మీదట బీజింగ్‌ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించాల్సిన అవసరం లేదని తెలిపారు. వరుసగా 13 రోజులుగా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ ప్రజలు మాత్రం మాస్క్‌ ధరించి తిరగడం గమనార్హం.

సామాజిక ఒత్తిడి, సురక్షితను దృష్టిలో పెట్టుకుని మాస్క్‌ ధరిచండానికే ప్రజలు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఓ మహిళ మాట్లాడుతూ.. మాస్క్‌ తీసేయ్యాలని అనుకుంటాను. కానీ ఇతరులు దీన్ని అంగీకరిస్తారో లేదో తెలియదు. నేను మాస్క్‌ తీసేసి తిరిగితే నా పక్క వారు భయాందోళనలకు గురవుతారు. అందుకే మాస్క్‌ తీసేయడం లేదు’ అన్నారు. బీజింగ్ మున్సిపల్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఏప్రిల్ చివర్లో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ లేకుండా వెళ్ళవచ్చని చెప్పింది. కానీ నగరంలోని అతిపెద్ద మార్కెట్‌లో కొత్త కేసులు వెలుగు చూడటంతో జూన్‌లో నిబంధనలు వెంటనే అమల్లోకి వచ్చాయి. (ఈ మాస్క్ ధర, యజమాని గురించి తెలిస్తే...)

రాజధాని, జిన్జియాంగ్, ఇతర ప్రాంతాలలో కేసులను విజయవంతంగా నియంత్రించిన తరువాత గత ఐదు రోజులుగా ఇక్కడ కొత్తగా కేసులు నమోదు కాలేదు. మాస్క్‌ ధరించడం, హోం క్వారంటైన్‌, టెస్టింగ్‌లో పాల్గొనడం వంటి నియమాలను కఠినంగా అమలు చేయడం వల్లనే ఈ వ్యాధిని నియంత్రించడంలో చైనా విజయవంతం అయ్యిందంటున్నారు నిపుణులు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top