అంతరిక్షంలో చెత్తకు కొత్త విరుగుడు.. అక్కడే మండించేందుకు పరికరం

Astronauts are taking out the ISS trash using Bishop Airlock - Sakshi

హూస్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్‌ అనే ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ తయారు చేసింది. బిషప్స్‌ ఎయిర్‌లాక్‌ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్‌ఎస్‌లో ఆస్ట్రోనాట్‌ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి.

ఈ వ్యర్థాలను ఐఎస్‌ఎస్‌కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్‌ కార్గో వెహికల్‌ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్‌ ఎయిర్‌ లాక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్‌ తెలిపింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top