ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ పరీక్షలు మళ్లీ షురూ!

AstraZeneca coronavirus vaccine clinical trials resume in UK - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిలిపివేశామంటూ ఉసూరుమనిపించిన బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ మళ్లీ  శుభవార్త చెప్పింది. మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఎ) ధృవీకరించిన తరువాత యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ కరోనావైరస్ వ్యాక్సిన్ ట్రయల్‌ను తిరిగి ప్రారంభించినట్లు బ్రిటిష్-స్వీడిష్ సంస్థ ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. డేటాను స్వతంత్రంగా సమీక్షించిన తరువాత ట్రయల్స్ తిరిగి ప్రారంభించాలని యూకే రెగ్యులేటరీ అథారిటీ సిఫారసు చేసినట్లు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. (ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌కు భారత్‌లో బ్రేక్‌)

ఆక్స్‌ఫర్డ్, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ సందర్భంగా ఒక వాలంటీర్ అనారోగ్యానికి గురికావడంతో తాత్కాలికంగా ప్రయోగాలకు విరామం ఇచ్చినట్టు ప్రకటించింది. దీనిపై తమకు సమాచారం అందించలేదనీ, భద్రతా కారణాల రీత్యా పరీక్షలు నిలిపివేసి వివరణ ఇవ్వాలంటూ పూణేకు చెందిన అతిపెద్ద టీకా తయారీ సంస్థ సీరంకు డ్రగ్ కంట్రోలర్స్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) షోకాజ్ నోటీసులిచ్చింది. దీంతో మనదేశంలో ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి పొందిన సీరం కూడా ఇండియాలో పరీక్షలకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. (వ్యాక్సిన్ అభివృద్ధిలో తొందర పనికిరాదు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top