ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి(సెక్రటరీ జనరల్)గా ఆంటోనియో గుటెరస్(72) మరోసారి ఎన్నికయ్యారు. సమితి సాధారణ సభ శుక్రవారం ఆయనను ఎన్నుకుంది. రెండోసారి ఈ పదవిలో గుటెరస్ నియామకం 2022 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. 2026 డిసెంబర్ 31వ తేదీదాకా.. అంటే ఐదేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. జనరల్ సెక్రటరీగా గుటెరస్ రెండోసారి ఎన్నికకు భారత్ ఇంతకుముందే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. గుటెరస్ 2017 జనవరి 1న ఐరాస 9వ సెక్రెటరీ జనరల్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ ఏడాది డిసెంబర్ 31న పదవీ కాలం ముగియనుంది.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
