‘హౌతీ’లపై ఆగని అమెరికా దాడులు

America Destroyed Houthis Drone In Red Sea - Sakshi

వాషింగ్టన్‌: ఎర్ర సముద్రంలో హౌతీ రెబెల్స్‌ ప్రయోగించిన డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికా  తెలిపింది. హౌతీల డ్రోన్‌ వల్ల నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించింది. ఈ  మేరకు అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ శనివారం ఒక  ప్రకటన విడుదల చేసింది. యెమెన్‌లో హౌతీల స్థావరాలపై జరిపిన దాడుల్లో హౌతీలకు చెందిన ఒక అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌(యూఏవీ)ని ధ్వంసం చేసినట్లు తెలిపింది.

హౌతీల దగ్గరున్న పరికరాలన్నీ ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధంలో పాలస్తీనాకు మద్దతుగా ఎర్ర సముద్రం నుంచి వెళుతున్న హౌతీలు నౌకలపై గత కొంతకాలంగా దాడులకు పాల్పడుతున్నారు. హౌతీల దాడుల వల్ల ఆసియా నుంచి యూరప్‌ అమెరికా వెళ్లే దక్షిణాఫ్రికా నుంచి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది.  దీంతో అమెరికా, బ్రిటన్‌లు యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై దాడులు చేస్తున్నాయి.    

ఇదీ చదవండి.. అమెరికాలో బుర్రిపాలెం విద్యార్థి అనుమానాస్పద మృతి  

Election 2024

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top