జిన్‌పింగ్‌కి వంగి నమస్కరిస్తూ చేతిని ముద్దాడిన పుతిన్‌!ఇది నిజమేనా?

AI Generated Viral Photo Of Putin Bowing To Xi Jinping  - Sakshi

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మూడు రోజుల రష్యా పర్యటన కోసం సోమవారమే మాస్కో చేరకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అక్కడికి చేరుకున్న జిన్‌పింగ్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమై.. ఉక్రెయిన్‌ యుద్ధ శాంతి ప్రణాళిక చర్చలతో సహా పలు విషయాలను చర్చించనున్నారు. వాస్తవానికి ఈ యుద్ధంలో పాల్గొన్న ఇరు పక్షాలు తమ ఆందోళనలను విరమించి యుద్ధానికి ముగింపు పలికేలా చేయడమే ఈ పర్యటన లక్ష్యం. ఐతే ఉన్నతస్థాయి దౌత్య చర్చల మధ్య పుతిన్‌ జిన్‌పింగ్‌కి వంగి వంగి నమస్కరిస్తూ.. చేతిని ముద్దాడుతున్న పోటో ఒక్కసారిగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ఇలాంటి సమయంలో ఈ ఫోటో మరిన్ని విభేదాలకు తావిచ్చేలా ఉడటంతో ఇది అసలు నిజమా? లేక ఫేక్‌ ఫోటోనా అని తనిఖీ చేయడం ప్రాంభించారు నిపుణులు. ఆ తర్వాత ఇది నకిలీదని తేలింది. ఆర్టిఫషియల్‌ టెక్నాలజీతో రూపొందించిన ఫోటో అని నిర్థారించారు. దీనిపై క్షణ్ణంగా విచారణ జరిపిన అమండా ఫ్లోరియన్‌ అనే అమెరికన్‌ జర్నలిస్ట్‌ ఇలాంటి ఫోటోలు హాంకాంగ్‌, పోలాండ్‌, ఉక్రెయిన్‌ మూలాలకు సంబంధించన సైట్లో దాదాపు 239 ఫోటోలను చూశానని, ఇది నకిలీదని తేల్చి చెప్పారు. ఇది నకిలీ ఫోటోనే అని ఫ్రెంచ్‌ టెక్‌ కంపెనీ ఆర్టిఫిషియల్‌ ఇమేజ్‌ డిటెక్టర్‌ సాయంతో  నిర్థారించిందని తెలిపారు. ఆ ఫోటోను నిశితంగ పరిశీలిస్తే మనకు స్పష్టంగా అవగతమవుతుందని అన్నారు.

ఉక్రెయిన్‌ వివాదా పరిష్కారం కోసం, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను బలోపేతం చేసేందుకు జరగుతున్న భేటీని కాస్త దెబ్బతీసేలా ఈ ఫోటో ఉందన్నారు. ఈ ఫోటో కారణంగా ఇరు దేశాల మధ్య విభేదాలు సృష్టించి, సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందన్నారు. ఈ మేరకు సదరు జర్నలిస్ట్‌ మాట్లాడుతూ..ఇలాంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నప్పుడూ..నెటిజన్లకు ఏది నకిలీ ఏది రియల్‌ అనేది తెలుసుకోవడం అత్యంత కీలకమని చెప్పారు.

లేదంటే తప్పుడూ సమాచారం వ్యాప్తి చెందడమే గాక ఇరు దేశాల మద్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునే పరిస్థితికి దారితీసుందని హెచ్చరించారు. అదీగాక సరిగ్గా చైనా అధ్యక్షుడు పర్యటనలో ఉండగా ..ఇలాంటి ఫోటోలు మరింత వివాదాలకు తెరితీసే ఆస్కారం ఏర్పడుతుందన్నారు. కాబట్టి అలాంటి వాటికి చెక్‌పెట్టేలా జాగ్రత్తగా ఉండటమేగాక, పూర్తిగా తెలుసుకున్నాకే ఇలాంటి ఫోటోలను షేర్‌ చేయమని సదరు జర్నలిస్ట్‌ నెటిజన్లను కోరారు. 

(చదవండి: హాట్‌ టబ్‌లో సేద తీరుతున్న జంటపై సడెన్‌గా మౌంటైన్‌ లయన్‌ దాడి..ఆ తర్వాత..)

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top