చైనాలో రెస్టారెంట్‌ కూలి 17 మంది మృతి | 17 killed as restaurant collapses in China | Sakshi
Sakshi News home page

చైనాలో రెస్టారెంట్‌ కూలి 17 మంది మృతి

Aug 30 2020 5:04 AM | Updated on Aug 30 2020 5:05 AM

17 killed as restaurant collapses in China - Sakshi

బీజింగ్‌: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో ఒక రెస్టారెంటు కుప్పకూలి 17 మంది మరణించారు. లిన్‌ఫెన్‌ అనే పట్టణంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండంతస్తుల ఈ హోటల్‌ భవనం శిథిలాల నుంచి మొత్తం 45 మందిని బయటకు తీశారు. వీరిలో 17 మంది విగతజీవులుగా బయటపడగా, 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. భవనం కూలిపోవడానికి కారణాలేమిటనేది వెంటనే తెలియరాలేదు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement