
హైదరాబాద్: వివాహం కుదరదేమోనన్న ఆందోళనతో ఓ మహిళా కానిస్టేబుల్ బుధవారం ఆత్మహత్య చేసుకుంది. శాలిబండ పోలీసులు తెలిపిన మేరకు.. కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన పర్వతాలు కుమార్తె సురేఖ(28) ఛత్రినాక పోలీస్ స్టేసన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. వీరి కుటుంబం శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శంషీర్‌గంజ్ కాల్వగడ్డలో నివాసం ఉంటుంది.
గతంలో వివాహం నిశ్చయమవగా అనివార్య కారణాలతో రద్దయ్యింది. తాజాగా ఈ నెల 1న మరో యువకుడితో నిశ్చయమయినప్పటికీ ఇరు కుటుంబాల నడుమ గొడవలు తలెత్తాయి. ఈ వివాహం కూడా కుదరదేమోనన్న భయంతో ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.