అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

అర్జీల పరిష్కారానికి తక్షణ చర్యలు

హన్మకొండ అర్బన్‌: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలు బాధ్యతాయుతంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈసందర్భంగా ప్రజల నుంచి కలెక్టర్‌ స్వయంగా అర్జీలు స్వీకరించారు. అర్జీలు పెండింగ్‌లో లేకుండా సంబంధిత శాఖల అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు.

232 అర్జీల స్వీకరణ

కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 232 అర్జీలు అందాయి. వీటిలో కలెక్టరేట్‌కు 116, ఆర్డీఓ కార్యాలయాల్లో 21, ఎంపీడీఓ కార్యాలయాల్లో 95 అర్జీలు అధికారులు స్వీకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ఎన్‌.రవి, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ శేషాద్రి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మేన శ్రీను, అధికారులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌ వినతులు పరిష్కరించాలి..

న్యూశాయంపేట: గ్రీవెన్స్‌ కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వినతులను సత్వరమే పరిష్కరించాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ఆమె ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మొత్తం 198 వినతులు వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 69, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి 32, ఉపాధి శాఖ 14, లీడ్‌ బ్యాంకు 12 రాగా, వివిధ శాఖలకు సంబంధించి మరో 73 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. ప్రతీ అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు నిర్ణీత సమయంలో పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఎల్‌.కిశోర్‌కుమార్‌, వై.వీ.గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్‌ పీడీ శ్రీవాణి, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి పాల్గొన్నారు.

వరంగల్‌ ఆర్డీఓ ఆఫీస్‌లో నిల్‌..

వరంగల్‌ రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో సోమవారం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌, ఆర్డీఓ కార్యాలయం పక్కపక్కనే ఉండడంతో ప్రజలు కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్‌కే మొగ్గుచూపుతున్నారని అధికారులు చెప్పారు. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో 9 దరఖాస్తులు అందాయని అందులో విద్యుత్‌శాఖకు సంబంధించి 2, రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి 3, జీజీహెచ్‌ 1, తహసీల్దార్‌ కార్యాలయం నర్సంపేటకు సంబంధించి 3 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement