ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ప్రారంభం

Nov 3 2026 2:21 AM | Updated on Nov 3 2026 2:21 AM

ఐజీఎంఎస్‌ పోర్టల్‌ ప్రారంభం

హన్మకొండ అర్బన్‌: హనుమకొండ జిల్లాలో గ్రావెల్‌, సాధారణ మట్టి తవ్వకాలు, తరలింపునకు అనుమతులు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు నూతన ఆన్‌లైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ వెల్లడించారు. ఇందుకోసం రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ గ్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థను ప్రారంభించినట్లు ఆమె పేర్కొన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పోర్టల్‌ పనితీరు, దరఖాస్తు ప్రక్రియ, పర్యవేక్షణ తదితర అంశాలను వివరించారు. దరఖాస్తు చేసుకున్న 5 రోజుల్లోగా అనుమతులు మంజూరు చేసేలా వ్యవస్థను రూపొందించినట్లు వివరించారు. ఈ పోర్టల్‌ కేవలం గ్రావెల్‌, సాధారణ మట్టి తవ్వకాలు, తరలింపులకు మాత్రమే వర్తిస్తుందని, ఇసుక తరలింపునకు వర్తించదని కలెక్టర్‌ స్పష్టం చేశారు. సీజీజీ సహకారంతో రూపొందించిన ఈ పోర్టల్‌ను ప్రయోగాత్మకంగా జిల్లాలో అమలు చేస్తున్నామని, ఇక్కడ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందన్నారు. అనంతరం నూతన ఆన్‌లైన్‌ గ్రావెల్‌ అనుమతుల విధానానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్‌ ఇతర అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఇందులో అదనపు కలెక్టర్లు ఎన్‌.రవి, బి.శేషాద్రి, జిల్లా రెవెన్యూ అధికారి కె.శ్రీనివాస్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement