నేడు టీచర్లకు సమృద్ధి కార్యక్రమం | - | Sakshi
Sakshi News home page

నేడు టీచర్లకు సమృద్ధి కార్యక్రమం

Jan 17 2026 11:49 AM | Updated on Jan 17 2026 11:49 AM

నేడు

నేడు టీచర్లకు సమృద్ధి కార్యక్రమం

నేడు టీచర్లకు సమృద్ధి కార్యక్రమం టీటీడీ ఆధ్వర్యంలో గోపూజలు ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకం ఇద్దరు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

విద్యారణ్యపురి: వివిధ కళారూపాల్లో ఉపాధ్యాయులను ప్రోత్సహించేందుకు ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్టీ గోదావరి హాల్‌లో సమృద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. పెయింటింగ్‌, డ్రాయింగ్‌, స్కెచింగ్‌, జానపద కళ, రంగోళి, శిల్పం, చేతిపనులు, కాలిగ్రఫీ, కవిత్వం, కథ చెప్పడం, వ్యాసరచన, సంగీతం (గాన, వాయిద్యం), నృత్యం, శాసీ్త్రయ, జానపద తదితర పోటీల్లో పాల్గొనవచ్చని హనుమకొండ జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మన్‌మోహన్‌ శుక్రవారం తెలిపారు. ప్రతిభ చూపిన వారిని జాతీయస్థాయి పోటీలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తిగల ఉపాధ్యాయులు రిజిస్ట్రేషన్‌ చేసుకొని పాల్గొనవచ్చని డాక్టర్‌ మన్‌మోహన్‌ సూచించారు.

హన్మకొండ కల్చరల్‌: కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండ బాలసముద్రం కూరగాయల మార్కెట్‌లోని గోశాలలో గోపూజలు నిర్వహించారు. శేషభట్టర్‌స్వాగతాచార్యులు గోమహత్యం గురించి వివరించారు. కార్యక్రమంలో టీటీడీ కార్యక్రమ జిల్లా బాధ్యులు రామిరెడ్డి కృష్ణమూర్తి, మార్కెట్‌ సభ్యులు బీజేపీ నాయకుడు రఘుపతి, టీటీడీ కల్యాణ మండపం మేనేజర్‌ రఘువీర్‌ పాల్గొన్నారు.

గోవు సకల దేవతల స్వరూపం

గోవు సకల దేవతా స్వరూపమని, వేదాలు, పురాణ సాహిత్యంలోనూ చెప్పబడిందని వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. కనుమ పండుగను పురస్కరించుకుని శుక్రవారం వేయిస్తంభాల ఆలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో గోవును నూతన వస్త్రంతో అలంకరించి శ్రీసూక్తవిధానంతో పూజలు చేశారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, సందీప్‌శర్మ పాల్గొన్నారు.

హన్మకొండ: ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ డ్రైవర్ల పాత్ర కీలకమని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపట్టిన ‘అరైవ్‌.. అలైవ్‌’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం వరంగల్‌ ట్రాఫిక్‌ విభాగం ఆధ్వర్యంలో ఆర్టీసీ హనుమకొండ డిపోలో రోడ్డు ప్రమాదాలపై ఆర్టీసీ ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్యగా మారిందన్నారు. ఆర్టీసీకి సంబంధించి రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో ఆర్టీసీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. రాత్రి సమయాల్లో బస్‌ బ్రేక్‌ డౌన్‌ అయితే బస్సు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మేడారం జాతరలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రోడ్లపై బస్సులను నిలిపివేయవద్దని డ్రైవర్లకు సూచించారు. అనంతరం సుదీర్ఘకాలంగా డ్రైవర్‌గా పనిచేస్తూ ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా విధులు నిర్వర్తించిన వారిని పోలీస్‌ కమిషనర్‌ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించారు. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ కవిత, ట్రాఫిక్‌ అదనపు డీసీపీ ప్రభాకర్‌ రావు, డిప్యూటీ రీజినల్‌ మేనేజర్‌ కేశరాజు భానుకిరణ్‌, డిపో మేనేజర్‌ ధరంసింగ్‌, కాజీపేట ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకన్న, సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రంజిత్‌ పాల్గొన్నారు.

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పలువురు పోలీస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌సింగ్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఆర్‌బీలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ముస్కె శ్రీనివాస్‌ను నర్సంపేటకు, నర్సంపేటలో పని చేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌.రఘుపతిని సీసీఆర్‌బీకి బదిలీ చేశారు. వీఆర్‌లో ఉన్న సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.వెంకన్నను సుబేదారి పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

నేడు టీచర్లకు  సమృద్ధి కార్యక్రమం1
1/1

నేడు టీచర్లకు సమృద్ధి కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement