లక్ష గాజులు.. సుహాసినికి పూజలు
వరంగల్ చౌరస్తా: వరంగల్ రామన్నపేట ఆర్యవైశ్య సత్రంలో శుక్రవారం ఘనంగా కై లాస గిరి వ్రతం నిర్వహించారు. ఎంజీఎం రోడ్డులోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 121 మంది మహిళలు పాల్గొని లక్ష గాజులు సమర్పించారు. 600 మంది మహిళా భక్తులు సుహాసిని పూజ నోములు ఆచరించారు. ఈసందర్భంగా సంఘం అధ్యక్షుడు ఇరుకుల్ల రమేశ్, రాజమణి మాట్లాడుతూ.. నోముల కార్యక్రమం గత రెండేళ్లుగా తమ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నోములో పాల్గొన్న మహిళల కుటుంబాలకు ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు గట్టు మహేశ్‌బాబు ప్రధాన కార్యదర్శి అకినపల్లి సత్యనారాయణ, కోశాధికారి బెజుగం రజనీకాంత్, వ్యవస్థాపకులు వెలగందుల రమేశ్, వీరభద్ర రావు, తోట నవీన్‌కుమార్, దివ్వెల శ్రీనివాస్, వెంకటకృష్ణ, పనేశ్, నాగరాజు, రాజన్న, విశ్వప్రసాద్, పసునూరి శ్రీనివాస్, అయిత శ్రీనివాస్, అశోక్, కిశోర్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.


