
ఆరోగ్య జిల్లాలుగా మార్చాలి
● సీజనల్ వ్యాధుల పర్యవేక్షణ
ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి
న్యూశాయంపేట/హన్మకొండ అర్బన్: వరంగల్, హనుమకొండ జిల్లాలను ఆరోగ్య జిల్లాలుగా మార్చేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, సీజనల్ వ్యాధుల నియంత్రణ, పర్యవేక్షణ ప్రత్యేక అధికారి వాసం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సీఎం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆయన గురువారం వరంగల్, హనుమకొండ కలెక్టరేట్లలో కలెక్టర్లు సత్యశారద, స్నేహ శబరీష్ అధ్యక్షతన సీజనల్ వ్యాధులపై సమీక్షించారు. ఆయా జిల్లాల్లో తీసుకుంటున్న వ్యాధి నివారణ చర్యలను వివరించారు. సీజనల్ వ్యాధుల్ని అరికట్టేందుకు కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీపీఓలు కల్పన, లక్ష్మీ రమాకాంత్, డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, డాక్టర్లు కిషోర్, ము రళి, రామ్మూర్తి, కిషన్, మోహన్‌దాస్, ప్రకాశ్, కొంరయ్య అశ్విన్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్‌మోహన్ రావు, జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌతమ్ చౌహన్, అధికారులు పాల్గొన్నారు.