
ఇప్పటికీ పేదరికంలోనే..
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నా.. బీదలు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నారు. రాజకీయ నేతలు అభివృద్ధి అని అంటున్నారే తప్ప అంతర్గతంగా గ్రామాలు, మారుమూల తండాలకు కనీస సౌకర్యాలు కల్పించట్లేదు. ఆడపిల్లలకు సమాన హక్కులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. రాజకీయ నాయకులు, ప్రజలకు నిజమైన సేవలందిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.
– ఎండీ. సానియామీర్, బీఎస్సీ మూడో సంవత్సరం
భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చాలా చిన్న దేశాలకు స్వాతంత్య్రం వచ్చి అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాయి. కానీ, 150 కోట్లకుపైగా జనాభా ఉన్న భారతదేశం మాత్రం అభివృద్ధిలో వెనుకంజలో ఉంది. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులు. కొంతమంది ధనార్జనే ధ్యేయంగా ఆస్తులు సంపాదిస్తున్నారు. ముందుగా రాజకీయ నాయకులు మారితేనే దేశం మారుతుంది.
– గోగు రమేశ్, బీకాం మూడో సంవత్సరం
అనేక మంది సమరయోధుల పోరాటాలతోనే దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఇన్నేళ్లు గడిచినా దేశంలో ఎక్కడి ప్రజలు అక్కడే ఉన్నారు. పేదలను పట్టించుకోనే నాథుడే లేడు. ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా నేటితరం విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశానికి తమవంతు సహాయం అందించేలా బాధ్యత తీసుకుంటేనే భవిష్యత్‌లో దేశం ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తుంది.
– జాహ్నవి, బీకాం, ద్వితీయ సంవత్సరం
రాజకీయ నాయకులకు అక్రమ సంపాదనపై ఉన్న మక్కువ దేశాభివృద్ధిపై లేదు. స్వార్థపు ఆలోచనలతోనే బతుకుతున్నారు. ఎవరు ఎటుపోతే నాకేంటి? అనుకుంటున్నారు. తోటి మిత్రులకు, పేదలకు, ఇతరులకు సాయం అందించినప్పుడు దేశం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. పదిమంది చేసే పనిని ఒక ఏఐ చేస్తే మిగతావారి పొట్టకొట్టినట్లే కదా. ఏఐతో మానవ మనుగడకు ముప్పే.
– ఎస్‌కే అన్వర్, బీఏ, తృతీయ సంవత్సరం
ఆనాటి పోరాట యోధులు తెల్లదొరల తుపాకీ గుండ్లకు ఎదురు నిలబడి, ప్రాణత్యాగాలు చేసి భారత్‌కు స్వాతంత్య్రం తీసుకొచ్చారు. నవ చైతన్యానికి విద్య పునాది అని అంబేడ్కర్ చెప్పినట్లుగా యువకులు ఉన్నత చదువులు చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలి. ప్రభుత్వాలు ఉచిత పథకాలు ఆపేసి ఉచిత విద్య, వైద్యంపై దృష్టి పెట్టాలి. – మహంకాళి వరుణ్, బీకాం తృతీయ సంవత్సరం
●

ఇప్పటికీ పేదరికంలోనే..

ఇప్పటికీ పేదరికంలోనే..

ఇప్పటికీ పేదరికంలోనే..

ఇప్పటికీ పేదరికంలోనే..