
అడిషనల్ డీసీపీ రవికి ఇండియన్ పోలీస్ మెడల్
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో పరిపాలన విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న నల్లమల రవి ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 79వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రవి ఇండియన్ పోలీస్ మెడల్‌కు ఎంపికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లా ఏనుగొండ ప్రాంతానికి చెందిన అడిషనల్ డీసీపీ నల్లమల రవి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ పూర్తి చేసి 1991లో ఎస్సైగా ఎంపికయ్యారు. మెదక్ జిల్లాలోని శివంపేట, తుఫ్రాన్, మునిపల్లె పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు. అనంతరం సీఐగా అమ్రాబాద్, మిర్యాలగూడ,సదాశివాపేట సర్కిల్ పీఎస్‌లలో పనిచేశారు. డీఎస్పీగా సంగారెడ్డి, జహీరాబాద్, అడిషనల్ డీసీపీ కరీంనగర్, పోలీస్ టైనింగ్ సెంటర్ ప్రిన్సిపాల్‌గా, అదనపు డీసీపీగా పనిచేశారు. నక్సల్ ప్రాబల్యం ఉన్న పీఎస్‌లల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించడంతోపాటు సమస్యాత్మాక ప్రాంతాల్లో కూడా విజయవంతంగా విధులు నిర్వర్తించి అధికారుల మన్ననలు పొందారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ రవికి సీపీ సన్‌ప్రీత్ సింగ్‌తోపాటు డీసీపీలు, అడిషనల్ డీసీపీ, ఏఎస్పీలు, అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.