
వేగవంతంగా పన్నులు వసూలు చేయాలి
రామన్నపేట : కార్పొరేషన్ అఽధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వీడి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ పన్నులు వసూలు చేయాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కౌన్సిల్ హాల్‌లో పన్నుల ప్రగతిపై రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్‌లు, ప్రతీరోజు తమకు నిర్దేశించిన వసూళ్ల లక్ష్యాన్ని సాధించాలన్నారు. పన్ను వసూళ్లలో వెనుకంజలో ఉన్న సిబ్బంది ఈ నెల31లోగా పురోభివృద్ధి చూపించాలని ఆదేశించారు. సుదీర్ఘ కాలంగా పన్ను చెల్లించకుండా పెండింగ్‌లో ఉన్న వారికి నోటీసులు జారీ చేసి వసూలు జరిగేలా చూడాలని, సంబంధిత యాజమానికి చెందిన నల్లాలు తీసివేయడం, డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహకారంతో ఆస్తులు జప్తుచేయాలని పేర్కొన్నారు. వర్క్ ఇన్‌స్పెక్టర్, డీఆర్‌ఎఫ్ సిబ్బంది, డిప్యూటీ కమిషనర్, వార్డు ఆఫీసర్, ఆర్‌ఐ, ఆర్‌ఓలు బృందాలుగా ఏర్పడి సమన్వయంతో పెండింగ్ బకాయిలు వసూలు చేయాలన్నారు. వీటికి సమాంతరంగా నల్లా పన్నులు వసలు చేయాలన్నారు. ఈ నెలా చివరిలోగా నల్లా పన్నులు వసూలు 20శాతం, ఆస్తిపన్ను వసూలు 30 శాతం చేరుకోవాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రవీందర్, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్‌ఓలు తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్