
నానో యూరియాతో అధిక దిగుబడి
● వరంగల్ డీఏఓ అనురాధ
నయీంనగర్: నానో యూరియాతో అధిక దిగుబడి వస్తుందని వరంగల్ జిల్లా వ్యవసాయ అధికారి(డీఏఓ) కె.అనురాధ తెలిపారు. బుధవారం హనుమకొండ నయీంనగర్ ప్రెసిడెంట్ దాబాలో ఇఫ్కో ఆధ్వర్యంలో నానో డీఏపీ, నానో కాపర్, నానో జింక్‌పై ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు సహకార సంఘాలు, డీసీఎంఎస్, డీలర్లు, అభ్యుదయ రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. సంప్రదాయ యూరియాను తగ్గించి నానో యూరియా, నానో డీఏపీ అధికంగా వాడాలని సూచించారు. శాస్త్రవేత్త రావుల ఉమారెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని నానో సాంకేతికత పరిజ్ఞానంతో మొదటిసారి యూరి యాను ద్రవరూపంలో తీసుకొచ్చిన ఘనత ఓ భారతీయుడిదన్నారు. ఇఫ్కో స్టేట్ మార్కెటింగ్ మేనేజర్ కృపాశంకర్, వరంగల్ మార్కెటింగ్ మేనేజర్ విశాల్ షిండే నానో ఎరువుల ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో డీఏఓలు సురేశ్‌కుమార్, విజయ నిర్మల, శాస్త్రవేత్తలు డీవై.రావు, రాములు, ఏడీఏ కె.దామోదర్ రెడ్డి, వరంగల్ ఏడీ కె.రవీందర్ రెడ్డి, ఏఓ టెక్నికల్ కృష్ణారెడ్డి, రైతులు, ఇఫ్కో సిబ్బంది పాల్గొన్నారు.