
సగానికిపైగా డిగ్రీ సీట్లు ఖాళీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధి లో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో సగానికిపైగా సీట్లు ఖాళీగానే ఉన్నాయి. కొన్ని కళాశాలల్లో సీ ట్లు ఎక్కువ శాతం భర్తీకాగా మరికొన్ని కళాశాలల్లో తక్కువ భర్తీ అయ్యాయి. పలుకోర్సులకు డిమాండ్ ఉండగా కొన్నింటికీ అంతగా ఆదరణ లభించడడం లేదు. మూడు దశల్లోనూ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలు కల్పించారు. ఇప్పటికే మూడు దశల్లో ప్రవేశాలు కల్పించగా స్పెషల్ ఫేజ్‌లో సీట్లు కేటాయించిన వారికి రిపోర్టింగ్ కూడా మంగళవారం ముగిసింది. యూనివర్సిటీ పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవే ట్, అటానమస్ డిగ్రీ కాలేజీలు 211 ఉన్నాయి. అందులో బీఏ, బీఎస్సీ, బీకామ్ జనరల్, బీకామ్ కంప్యూటర్స్, బీబీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, బీబీఏ రిటైల్ పలు కోర్సులు కంప్యూటర్ బేస్డ్ తో కూడా ఉన్నాయి. లైఫ్ సైన్సెస్ కోర్సులు కూడా ఉన్నాయి. ఇందులో 97వేల 930సీట్లు ఉన్నాయి. మూడుదశల్లోనూ, స్పెషల్ ఫేజ్‌లో కలిపి ఇందులో సోమవారం వరకు 40,585 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అక్కడక్కడ కాలేజీల్లో వేళ్లమీద లెక్కపెట్టేంత మంది అడ్మిషన్లు మినహా ఇంకా సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉండబోతున్నాయి.
ఇంజనీరింగ్, మెడిసిన్ వైపు మొగ్గు..
విద్యార్థులు సంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు కంటే వృత్తివిద్య, ఉపాధి కోర్సులవైపు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడిసిన్, పారా మెడికల్ తదితర కోర్సుల్లో చేరేందుకే ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో కంప్యూటర్ కాంబినేషన్ కోర్సులు డాటా సైన్స్ లైఫ్ సైన్సెస్‌తో కూడిన త దితర కోర్సులున్నప్పటికీ అంతగా ఆసక్తి చూపడంలేదు. డిగ్రీ విద్యార్థుల కోసం కొన్ని సంవత్సరాలు గా కేయూ పరిధిలో 30 వరకు గురుకుల డిగ్రీ కళా శాలలు కూడా ఏర్పాటై కొనసాగుతున్నాయి. కొందరు విద్యార్థులు గురుకుల డిగ్రీకళాశాలల్లోను నేరుగా ప్రవేశాలు పొందుతున్నారు. దీంతో కూడా ప్ర భుత్వ కళాశాలల అడ్మిషన్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. నగరంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో మొ త్తం 1,770 సీట్లకు 1,110 మాత్రమే భర్తీ అయ్యా యి. పింగిళి మహిళా కళాశాలలో 1,200 సీట్లకు 706 సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. అలాగే ఇతర డివిజన్ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోని కాలేజీల్లో సగానికి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి.
స్పాట్ అడ్మిషన్లు ప్రైవేట్ కాలేజీలకే..
డిగ్రీలో దోస్త్ ద్వారా సీట్లు కేటాయించిన కళాశాలల్లో ప్రవేశాలకు మంగళవారం గడువు ముగిసింది. ఆ తరువాత ఈనెల 13,14 తేదీల్లో రెండు రోజులపాటు ఇప్పటివరకు ఏఏ కళాశాలల్లో ప్రవేశాలు పొందలేని విద్యార్థులకు ఉన్నత విద్యామండలి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం కల్పించింది. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు నేరుగా తమ కళాశాలల్లో వేకెన్సీ సీ ట్లను భర్తీ చేసుకునే వీలు కల్పించింది. అయితే ప్ర భుత్వ డిగ్రీ కళాశాలలకు మాత్రం స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇవ్వలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్లను భర్తీచేసుకునేందకు అవకాశం కల్పించాలని ఆ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సురేందర్‌రెడ్డి, ఇతర బాధ్యులు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు.అవకాశం ఇస్తారా లేదా అని చూడాల్సిందే.
కేయూ పరిధిలో మొత్తం
డిగ్రీ కళాశాలలు : 211
మొత్తం సీట్లు : 97,930
భర్తీ అయిన సీట్లు : 40,585
కేటాయింపులు, భర్తీ సీట్ల వివరాలు..
కేయూ పరిధిలో మొదటిదశలో డిగ్రీ కళాశాలలకు 10,652 సీట్లు కేటాయించగా 5,289 మంది రిపోర్టు చేశారు. రెండో దశలో 9,732 సీట్లు కేటాయించగా అందులో 6,550 సీట్లు భర్తీ అయ్యాయి. మూడోదశలో 21,373 సీట్లు కేటాయించగా అందులో 17,019 సీట్లు భర్తీ అయ్యాయి. స్పెషల్ ఫేజ్‌లో 12,916 సీట్లు కేటాయించగా అందులో 11,727 మొత్తంగా 40,585 సీట్లు భర్తీ అయ్యాయి.
కేయూ పరిధిలో మొత్తం 97,930 సీట్లకు భర్తీ అయ్యింది 40 వేలే..
మూడు దశలు, స్పెషల్ ఫేజ్ ప్రవేశాలు కూడా పూర్తి
నేడు, రేపు ప్రైవేట్ కళాశాలలకు
స్పాట్ అడ్మిషన్లు
ఇంజనీరింగ్, మెడిసిన్,
ఇతర కోర్సుల వైపే విద్యార్థుల మొగ్గు
సాంకేతిక కోర్సులు అందించినా
ఆదరణ కరువు