29న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష | - | Sakshi
Sakshi News home page

29న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష

Aug 13 2025 7:38 AM | Updated on Aug 13 2025 7:38 AM

29న క

29న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదో సెమిస్టర్‌ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత పొంది ఆరో సెమిస్టర్‌ పరీక్షలో ఒక సబ్జెక్టు ఫెయిల్‌యిన విద్యార్థులకు ఈనెల 29న ఇన్‌స్టంట్‌ పరీక్ష నిర్వహించనున్నామని పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 21వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. సంబంధిత కళాశాలల నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు కేయూ వెబ్‌సైట్‌ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసి.ఇన్‌ను చూడాలని రాజేందర్‌ పేర్కొన్నారు.

కేజీబీవీలో డీఆర్‌ఓ విచారణ

బచ్చన్నపేట : మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. ‘టీచర్లు కొడుతున్న విషయం చెప్పొద్దు’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి జిల్లా రెవెన్యూ అధికారి సుహాసిని, జీసీడీఓ గౌసియాబేగం స్పందించి మంగళవారం విచారణ చేపట్టారు. ఉదయం 11 గంటలకు కేజీబీవీకి వచ్చిన అధికారులు పాఠశాలలోని ప్రతీ విద్యార్థితో సాయంత్రం 5 గంటల వరకు మాట్లాడారు. అలాగే, ఉపాధ్యాయులతో కూడా మాట్లాడారు. సీఈసీ సెకండియర్‌లో ఆరుగురు బాలికలకు టీసీలు ఎవరు ఇస్తామన్నారని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలన్నారు. అలాగే, క్రమశిక్షణతోపాటు నాణ్యమైన బోధన చేపట్టాలన్నారు. విచారణ నివేదికను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు అందిస్తామని వారు వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల స్పెషలాఫీసర్‌ గీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాల్గొన్నారు.

హత్య కేసులో నిందితుడి రిమాండ్‌

కన్నాయిగూడెం: కూలి హత్య కేసులో నిందితుడిని మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనువాస్‌, ఎస్సై వెంకటేష్‌ వెల్లడించారు. సీఐ శ్రీనువాస్‌ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం స ర్వాయి గ్రామానికి చెందిన మడి రాజబాబు భ వన నిర్మాణ పనికి వెళ్లి మేసీ్త్ర కుమ్మరి బాబును కూలీ అడిగాడు. ఈ విషయంలో మేసీ్త్ర బావమరిది కోరం రంజిత్‌.. రాజబాబును హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేశారు. నిందితుడిని పట్టుకుని విచారించిన అనంతరం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

29న కేయూ డిగ్రీ  ఇన్‌స్టంట్‌ పరీక్ష 
1
1/2

29న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష

29న కేయూ డిగ్రీ  ఇన్‌స్టంట్‌ పరీక్ష 
2
2/2

29న కేయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement