
ఆగి ఉన్న లారీని ఢీకొన్న బైక్..
● వ్యాపారి మృతి.. మరొకరికి గాయాలు
● కేయూ క్రాస్ సమీపంలో ఘటన
హసన్‌పర్తి: బైక్ అదుపు తప్పి ఆగి లారీని ఢీకొన్న ప్రమాదంలో ఓ కిరాణ వ్యాపారి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం కాకతీయ యూనివర్సిటీ క్రాస్ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన బొడిగే సదానందం(53) కిరాణంతో పాటు కూరగాయల దుకాణం నిర్వహిస్తున్నాడు. మంగళవారం ఉదయం కూరగాయలు కొనుగోలుకు బైక్‌పై అదే గ్రామానికి చెందిన ఎర్ర సురేందర్‌తో కలిసి నగరానికి బయలుదేరాడు. ఈ క్రమంలో కేయూ క్రాస్ సమీపంలో చేరగానే బైక్ అదుపు తప్పి ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో సదానందం అక్కడికక్కడే మృతి చెందగా, సురేందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి భార్య స్వర్ణలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ తెలిపారు.