
స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్
హన్మకొండ: తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు అహర్నిశలు పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. జయశంకర్ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్మృతి వనంలోని జయశంకర్ విగ్రహానికి బండా ప్రకాశ్, హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, తెలంగాణ వాదులు, బీఆర్‌ఎస్ నాయకులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా బండా ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి చనిపోయే వరకు తెలంగాణ కోసం పోరాడారన్నారు. భావ వ్యాప్తి ద్వారా ఉద్యమం ఉదృతంగా సాగిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టడంతోపాటు ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హనుమకొండ తహశిల్దార్ రవీందర్ రెడ్డి, జయశంకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ కలెక్టరేట్‌లో..
న్యూశాయంపేట: వరంగల్ కలెక్టరేట్‌లో జయశంకర్ చిత్రపటానికి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రామిరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీటీడబ్ల్యూఓ సౌజన్య, ఏఓ విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ప్రకాశ్

స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్

స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్

స్వరాష్ట్ర సాధనకు పోరాడిన జయశంకర్