
కొడుకు హత్యకు గురయ్యాడని..
నల్లబెల్లి: కొడుకు హత్యకు గురయ్యాడనే మనస్తాపంతో తండ్రి అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లిలో జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బానోత్ కోక్యా(65), వాలి దంపతుల చిన్న కుమారుడు కొమ్మాలు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండడంతో గత ఏప్రిల్ 12న హత్యకు గురయ్యాడు. అప్పటి నుంచి కోక్యా మనస్తాపానికి గురై ఆహారం మానేశాడు. దీంతో కొంతకాలంగా అనారోగ్యానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం కుటుంబ సభ్యులతో కుమారుడి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మంచంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు.
● మనస్తాపంతో తండ్రి మృతి
● మూడు చెక్కలపల్లిలో ఘటన