
ప్రయోగాలతో సైన్స్‌బోధన
విద్యారణ్యపురి: విజ్ఞానశాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా బోధించినప్పుడే విద్యార్థుల్లో శాసీ్త్రయ వైఖరులు పెంపొందుతాయని హనుమకొండ జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి తెలిపారు. బుధవారం హనుమకొండలోని లష్కర్‌బజార్‌లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని జిల్లా సైన్స్ కేంద్రంలో అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్– ఏటీఅండ్‌టీ సంస్థ ఆధ్వర్యంలో అగస్త్య ఫౌండేషన్ వారి సౌజన్యంతో విద్యార్థులకు సులభంగా బోధించే విషయంపై జిల్లాలోని ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..భౌతికశాస్త్ర విషయాలను ప్రయోగాత్మకంగా సులభంగా బోధించేందుకు తక్కువ ఖర్చుతో రూ పొందించిన కృత్యాలను ఉపాధ్యాయులచే చేయించారు. కార్యక్రమంలో భౌతికశాస్త్ర ఫోరం బాధ్యులు ఎ.జ్ఞానేశ్వర్, సత్యనారాయణ, అగస్త్య ఫౌండేషన్ ఏరియా మేనేజర్ చల్ల మౌనిక, విషయ నిపుణులు డి.వెంకట్‌రెడ్డి, రిసోర్స్ పర్సన్‌లు మహేందర్, తిరుపతి, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి