
కేసీఆర్, హరీశ్‌రావు, ఈటల జైలుకే
హసన్‌పర్తి : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాల్లో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌తో పాటు 11 మంది ఇంజనీర్లు జైలుకు వెళ్తున్నారని వర్ధన్నపేట ఎమ్మె ల్యే కే.ఆర్.నాగరాజు అన్నారు. మండలంలోని గంటూరుపల్లిలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి, అక్రమాలు జరిగినట్లు క మిషన్ నివేదిక ఇచ్చారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరు చెప్పుకుని కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసిందన్నారు.
పారదర్శకంగా ఇళ్ల మంజూరు
పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు తెలిపారు. రాజ కీయాలకతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇళ్లు మంజూరు చేస్తామని వచ్చే బ్రోకర్లను నమ్మి డబ్బులు ఇవ్వొద్దన్నా రు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రాంనర్సింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు చాణిక్యారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి, మాజీ సర్పంచ్‌లు కిషన్‌రెడ్డి, కుమారస్వామి, సంతోష్, రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో
భారీ అవినీతి
పారదర్శకంగా ఇందిరమ్మ
ఇళ్ల మంజూరు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు