ముందస్తు అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

ముందస్తు అప్రమత్తత అవసరం

Aug 5 2025 6:07 AM | Updated on Aug 5 2025 6:07 AM

ముందస్తు అప్రమత్తత అవసరం

ముందస్తు అప్రమత్తత అవసరం

రామన్నపేట: వర్షాకాలంలో తలెత్తే ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు అప్రమత్తత అవసరమని, ఆ మేరకు అధికారులు సమాయత్తం కావాలని రాష్ట్ర రెవెన్యూ(విపత్తు నిర్వహణ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో వరంగల్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, స్నేహా శబరీష్‌, గ్రేటర్‌ కమిషనర్‌ చాహాత్‌ బాజ్‌పాయ్‌తో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ.. గతంలో వరద ముంపు సమయంలో ప్రజలు పడిన ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటినుంచే ముందస్తు చర్యలు తీసుకోవాలని, సకాలంలో స్పందించకపోతే చిన్న సమస్య కూడా పెద్ద విపత్తుగా మారే అవకాశం ఉంటుందని అధికారులను హెచ్చరించారు. నగరంలోని ప్రధాన నాలాల స్థితిగతులు, పూడికతీతపై సమీక్షిస్తూ వరద నీరు నిల్వకుండా నాలాల్లోకి పంపేలా ముందస్తుగా చర్యలు తీసుకోవాలన్నారు. బయట నుంచి వచ్చే వరద నీటిని దారి మళ్లించేలా చూడాలని, కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించబడే డీఆర్‌ఎఫ్‌, జిల్లా అగ్నిమాపక శాఖ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా ముంపునుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రస్థాయిలో 6వ ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు అందుబాటులో ఉన్నాయని, అత్యవసర పరిస్థితుల్లో ఈ బృందాలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ కమాండ్‌ రూమ్‌ ద్వారా నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. పునరావాస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలన్నారు. గ్రేటర్‌ వరంగల్‌లోని 66 డివిజన్‌ల కార్పొరేటర్లు, సంబంధిత అధికారులతో వాట్సాప్‌ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగు చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలపై హనుమకొండ, వరంగల్‌ జిల్లాల కలెక్టర్లు, కార్పొరేషన్‌ కమిషనర్‌లు ప్రధాన కార్యదర్శికి వివరించారు.

క్షేత్రస్థాయిలో పరిశీలన..

గతంలో వరద ముంపునకు గురైన నయీంనగర్‌ నాలా, రాజాజీ నగర్‌ కల్వర్టు, ప్రెసిడెన్సీ పాఠశాల నుంచి నయీంనగర్‌ వరకు నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌, జవహర్‌నగర్‌, సమ్మయ్యనగర్‌, భద్రకాళి చెరువు, ఎఫ్‌టీఎల్‌లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ జోనా, ఉప కమిషనర్‌లు అరవింద్‌, పారిశుధ్య ఇంజనీరింగ్‌ ఎలక్ట్రిక్‌ డీఆర్‌ఎఫ్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ముంపు సమస్యలను ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలి

నాలాల స్థితిగతులు, పూడికతీతపై సమీక్షించుకుని ముందుకెళ్లాలి

పునరావస కేంద్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి

విపత్తు నిర్వహణ ప్రత్యేక ప్రధాన

కార్యదర్శి అరవింద్‌కుమార్‌

గ్రేటర్‌ కార్పొరేషన్‌ కార్యాలయంలో

కలెక్టర్లు, కమిషనర్‌తో కలిసి సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement