
వినతులు పెండింగ్‌లో ఉండొద్దు..
రామన్నపేట: ప్రజావాణిలో వచ్చిన వినతులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని, పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్‌లో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా ఇంజనీరింగ్ విభాగం నుంచి 22, హెల్త్ అండ్ శానిటేషన్ 9’, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ) 12, టౌన్‌ప్లానింగ్ 52, మంచినీటి సరఫరా 9, హార్టికల్చర్ 1, ఎలక్ట్రికల్ 6 మొత్తం 109 ఫిర్యాదులను స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జి ఎస్‌ఈ, సిటీ ప్లానర్‌లు మహేందర్, రవీందర్ రాడేకర్ తదితరులు పాల్గొన్నారు.
పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి
అధికారులకు గ్రేటర్ కమిషనర్
చాహత్‌బాజ్‌పాయ్ ఆదేశం
వివిధ విభాగాల నుంచి
109 దరఖాస్తుల స్వీకరణ