
‘గ్రేటర్’కు నీటి సరఫరా ఇలా...
వరంగల్ ప్రజలకు ప్రధాన తాగు నీటి వనరు గోదావరి నది. దేవాదుల, లోయర్ మానేరు డ్యాంల నుంచి నీటిని వరంగల్ నగరానికి సరఫరా చేస్తున్నారు. వరంగల్ కార్పొరేషన్ అవసరాలను తీర్చేందుకు 4 ఫిల్టర్ బెడ్లలో ప్రతీ రోజు 219.78 ఎంఎల్డీ (మిలియన్స్ ఆఫ్ లీటర్స్ పర్ డే) నీటి శుద్ధి జరుగుతోంది. ఈతాగునీటి సరఫరా కోసం 960 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ ఉంది. దీనికి తోడు స్లమ్, ఎత్తయిన ప్రాంతాల్లో ఉన్న కాలనీలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తూ జీడబ్ల్యూఎంసీ పరిధిలో ప్రతీ ఇంటికి రోజువారీ నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే సుమారు 32 ప్రాంతాల్లో భగీరథ నీరు సరిగ్గా రాకపోవడంతో ప్రజలు కష్టాలు పడుతున్నారు.