రథోత్సవం ప్రారంభం
వరంగల్ : గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పెద్ద రథోత్సవం ప్రారంభమైంది. స్థానిక పురవీధుల్లో స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, మాజీ ఎంపీ పసునూరి దయాకర్, గోపాల నవీన్‌రాజ్, చింతాకుల సునీల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రథయాత్ర కొంత ఆలస్యంగా కరెంటు వైర్లు తీయడం మళ్లీ బిగించడంతో లేట్ అవుతుందని సోమవారం మధ్యాహ్నం వరకు దుర్గేశ్వర ఆలయం చేరుకుంటుందని తెలిపారు. సత్యనారాయణ, మీసాల ప్రకాశ్, జాతి రమేశ్, శ్రీనివాస్, బండి శంకర్, మహేష్, రాజు, శంకర్, పాల్గొన్నారు.
సేంద్రియ ఆహారం
తీసుకోవాలి
హన్మకొండ చౌరస్తా: సేంద్రియ పద్ధతిలో పండించిన వాటిని తినాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని నేరేళ్ల వేణుమాధవ్ కళాప్రాంగణంలో గ్రామ భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి గ్రామీణ ఉత్పత్తుల సంతను ఆదివారం బండా ప్రకాశ్ ము ఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత జంక్‌ఫుడ్‌కు అలవాటు పడి అనేక వ్యాధులు కొని తెచ్చుకుంటోందన్నారు. జంక్‌ఫుడ్, రసాయనాలతో కూడిన ఆహార పధార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ గ్రామ భారతి అధ్యక్షురాలు సూర్యకళ మాట్లాడుతూ ప్రజల్లో మార్పులు తీసుకురావాలన్న సదుద్దేశంతో ప్రతీ నెల ప్రకృతి సంత నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్, సంస్థ వరంగల్ జిల్లా బాధ్యుడు అజిత్‌రెడ్డి, తోట ఆనందం, అనిత, బయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్లు కల్పించాలి
హన్మకొండ చౌరస్తా: త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేశ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఎన్నికై న హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా మానుక సతీశ్, యువజన విభాగం అధ్యక్షుడిగా నడిపల్లి శ్రీధర్, జనగామ జిల్లా అధ్యక్షుడు ఏషబోయిన రమేశ్‌చేత ఆదివారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలను పరిష్కరించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు. సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షరీఫ్, జిల్లా సభ్యుడు నరేవ్, అనిల్, మమత పాల్గొన్నారు.
మల్లన్నకు ప్రత్యేక పూజలు
ఐనవోలు: సూర్యుడు మీనరాశి నుంచి మేష రాశిలోకి ప్రవేశించడం సందర్భంగా ఆదివారం ఐనవోలు మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక సంక్రమణ పూజలు నిర్వహించారు. ఉదయం ఆలయంలో నిత్య పూజలు నిర్వహించిన అనంతరం ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ముఖ్య అర్చకులు ఐనవోలు మధుకర్ శర్మ, వేద పండితులు విక్రాంత్ వినాయక్ జోషి ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం, రుద్ర హోమం జరిపించారు. అలాగే గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మలతో శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం నిర్వహించారు. కాగా.. ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి, ఒగ్గు కథలు చెబుతూ.. మల్ల న్న కల్యాణంతో పాటు ప్రత్యేక ఒగ్గు పూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, ఆలయ అర్చక సిబ్బంది పాల్గొన్నారు.
రథోత్సవం ప్రారంభం


