సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌

Published Tue, Mar 25 2025 2:09 AM | Last Updated on Tue, Mar 25 2025 2:04 AM

వరంగల్‌ క్రైం: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ నూతన పోలీస్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్‌ప్రీత్‌సింగ్‌ను డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సంతోషినితో పాటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు సోమవారం మర్యాద పూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ మాట్లాడుతూ.. నేరానికి పాల్పడిన నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసి బాధితులకు న్యాయం అందించాలని కోరారు. సీపీని కలిసిన వారిలో అసిస్టెంట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మురళీధర్‌రావు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రవికిరణ్‌, బృంద, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు పావని, దుర్గాబాయి ఉన్నారు.

కొనసాగుతున్న టెన్త్‌ పరీక్షలు

విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం హనుమకొండ జిల్లాలో 67కేంద్రాల్లో ఇంగ్లిష్‌ పరీక్ష నిర్వహించగా 11,994మంది విద్యార్థులకుగాను 11,987మంది హాజరుకాగా, ఏడుగురు గైర్హాజరయ్యారని డీఈఓ వాసంతి తెలిపారు. వరంగల్‌ జిల్లాలో 49కేంద్రాల్లో 9,221మంది విద్యార్థుకుగాను 9,208 మంది హాజరుకాగా, 13మంది గైర్హాజరయ్యారని సంబంధిత జిల్లా అధికారులు తెలిపారు.

‘ఇంటర్‌’ మూల్యాంకనం

విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ జవాబుపత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. కెమిస్ట్రీ, కామర్స్‌, హిస్టరీ సబ్జెక్టుల జవాబుపత్రాలను ఈనెల 25నుంచే దిద్దనున్నారు. ఆయా అధ్యాపకులు హాజరుకావాలని డీఐఈఓ గోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు.

విద్యతోనే ఉన్నతస్థాయి

కాజీపేట అర్బన్‌ : విద్యతోనే ఉన్నతస్థాయికి చేరుకుంటారని, విద్యార్థులు ఇష్టపడి చదవాలని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ అన్నారు. నిట్‌ వరంగల్‌ను సోమవారం ఆయన సందర్శించి మాట్లాడారు. నిట్‌లో పేద, గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని సూచించారు. అదే విధంగా టీచింగ్‌ ,నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. హాస్టల్స్‌, డైనింగ్‌హాల్‌, లైబ్రరీలను పరిశీలించారు. కార్యక్రమంలో నిట్‌ డైరెక్టర్‌ బిద్యాధర్‌ సుబుదీ, సిబ్బంది పాల్గొన్నారు.

ఎంజీఎం ఇన్‌చార్జ్‌

ఆర్‌ఎంఓల నియామకం

ఎంజీఎం : వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి ఇద్దరు ఇన్‌చార్జ్‌ ఆర్‌ఎంఓలను నియమించారు. ఆస్పత్రికి కొంతకాలంగా పూర్తిస్థాయి ఆర్‌ఎంఓలు లేకపోవడంతో పేరుకుపోయిన సమస్యలు, ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయి అఽధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టర్‌ సత్యశారద ప్రత్యేక దృష్టి సారించడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ అంబి శ్రీనివాస్‌ను సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓగా, డాక్టర్‌ శశికుమార్‌ను డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఓ నియమిస్తూ డీఎంఈ ఎ.నరేంద్రకుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

ఆర్‌ఎంఓలకు సన్మానం

సోమవారం బాధ్యతలు చేపట్టిన ఆర్‌ఎంఓలు శ్రీనివాస్‌, శశికుమార్‌ను హెల్త్‌, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌–3194 (ఐఎన్‌టీయూసీ) ఉమ్మడి జిల్లా చైర్మన్‌ బత్తిని సుదర్శన్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నాయకులు, ఉద్యోగులు శాలువాలతో సత్కరించారు. పూలబొకేలు అందించి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎన్టీయూసీ ఎంజీఎం బ్రాంచ్‌ నాయకులు ప్రీతీ సజిని, సాల్మ, నార్ల వేణు, సుజాత, సరళారాణి, కొడిపాక కార్తీక్‌, సంజీత, రజినీ తదితరులున్నారు.

సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌  డిప్యూటీ డైరెక్టర్‌1
1/2

సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌

సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌  డిప్యూటీ డైరెక్టర్‌2
2/2

సీపీని కలిసిన ప్రాసిక్యూషన్‌ డిప్యూటీ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement