పదో తరగతి పరీక్షలు షురూ | - | Sakshi
Sakshi News home page

పదో తరగతి పరీక్షలు షురూ

Mar 15 2026 4:48 AM | Updated on Mar 15 2026 4:48 AM

పదో తరగతి పరీక్షలు షురూ

విద్యారణ్యపురి: పదో తరగతి వార్షిక పరీక్షలు శని వారం ప్రారంభమయ్యాయి. హనుమకొండ జిల్లాలో 64 కేంద్రాల్లో తొలిరోజు తెలుగు పరీక్షను నిర్వహించారు. 12,049 మంది విద్యార్థులు పరీక్షలకు అందులో 12,033 మంది (99.87 శాతం) హాజరయ్యారు. 16 మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. కాగా, హనుమకొండ లష్కర్‌బజార్‌లో ని ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ హైస్కూల్‌, ప్రభుత్వ బాలి కల ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట డీఈఓ ఎల్వీ గిరిరాజ్‌గౌడ్‌ ఉన్నారు. అదేవిధంగా జిల్లాలోని మరో ఐదు పరీక్ష కేంద్రాలను రాష్ట్రస్థాయి అబ్జర్వర్‌, రాష్ట్ర మోడల్‌ స్కూల్స్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఎస్‌.శ్రీనివాసాచారి, 21 పరీక్ష కేంద్రాలను నాలుగు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు తనిఖీ చేశాయి.

వరంగల్‌ జిల్లాలో 9,479 మంది హాజరు..

కాళోజీ సెంటర్‌: వరంగల్‌ జిల్లాలో 9,492 మంది విద్యార్థులకు 9,479 మంది విద్యార్థులు హాజరయ్యారని డీఈఓ బి.రంగయ్యనాయుడు తెలిపారు. పదో తరగతి పరీక్షల కోసం 47 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కలెక్టర్‌ సత్యశారద నర్సంపేటలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పించిన వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆమె ఆదేశించారు. అదేవిధంగా కరీమాబాద్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్‌ను అర్డీఓ సుమ, ఖిలా వరంగల్‌ తహసీల్దార్‌ ఎండీ ఇక్బాల్‌, శంభునిపేటలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల సెంటర్‌ను జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, పోచమ్మ మైదాన్‌ని ఎస్‌ఆర్‌ హైస్కూల్‌ సెంటర్‌, దేశాయిపేటలోని నాగార్జున హైస్కూల్‌ సెంటర్‌, కొత్తవాడలోని గిర్మాజీపేట ప్రభుత్వ పాఠశాల సెంటర్‌, పైడిపల్లి హైస్కూల్‌ సెంటర్‌ను అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి తనిఖీ చేసినట్లు డీఈఓ తెలిపారు.

హనుమకొండ జిల్లాలో

99.87 శాతం మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement