ఏసీబీకి పట్టుబడిన పర్వతగిరి ఎస్సై | - | Sakshi
Sakshi News home page

ఏసీబీకి పట్టుబడిన పర్వతగిరి ఎస్సై

Aug 3 2024 1:48 AM | Updated on Aug 3 2024 1:48 AM

ఏసీబీకి పట్టుబడిన పర్వతగిరి ఎస్సై

ఏసీబీకి పట్టుబడిన పర్వతగిరి ఎస్సై

పర్వతగిరి: వరంగల్‌ జిల్లా పర్వతగిరి ఎస్సై గుగులోతు వెంకన్న శుక్రవారం వరంగల్‌ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 27వ తేదీ శనివారం పర్వతగిరి ఎస్సై గుగులోతు వెంకన్న ఆధ్వర్యంలో పెట్రోలింగ్‌ చేస్తుండగా మండలంలోని అన్నారం షరీఫ్‌ రోడ్డు వద్ద బెల్లంలోడుతో వెళ్తున్న వ్యానును పట్టుకున్నారు. బెల్లం లోడ్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చి వాహన యజమాని భాస్కర్‌, డ్రైవర్‌ రాకేశ్‌, వర్కర్‌ రవిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. కేసు నమోదు అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీ లేదా 35క్లాస్‌ బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీసులు ఇవ్వాల్సి ఉండగా అవి ఏమీ చేయకుండా పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇలా ఎందుకు తిప్పుకుంటున్నారని బాధితులు వారి మిత్రుడు అజ్మీరా వెంకట్‌ ద్వారా ఎస్సై గుగులోతు వెంకన్నను అడిగిస్తే.. స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అందుకు రూ.70వేలు ఇవ్వాలని ఎస్సై డిమాండ్‌ చేశారు. ఇందులో రూ.20వేలు ఆదివారం రోజున ఎస్సై చెప్పిన నంబర్‌కు ఫోన్‌ పే ద్వారా బాధితులు పంపించారు. మిగతా రూ.50వేలు ఇస్తేనే 35క్లాస్‌ బీఎన్‌ఎస్‌ఎస్‌ నోటీసులు ఇస్తానని ఎస్సై చెప్పడంతో అంగీకరించిన బాధితులు కొంత సమయాన్ని కోరి ఎస్సైని ఎలాగైనా ఏసీబీకి పట్టించాలని నిర్ణయించుకున్నారు. ఫోన్‌ ద్వారా వరంగల్‌ ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ ప్లాన్‌ ప్రకారం డబ్బులు ఇచ్చే ముందు తమకు సమాచారం ఇవ్వాలని బాధితులకు తెలిపి సమయానికి పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బాధితులు డబ్బులు ఎవరికి ఇవ్వాలని ఎస్సైని అడగగా ఎస్సై డ్రైవర్‌ సదానందానికి ఇవ్వాలని సూచించడంతో డ్రైవర్‌ సదానందానికి నగదు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఎస్సై వెంకన్న చెబితేనే డబ్బులు తీసుకున్నట్లు డ్రైవర్‌ సదానందం అంగీకరించాడు. దీంతో ఎస్సై వెంకన్నతోపాటు డ్రైవర్‌ సదానందంపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకుని శనివారం ఉదయం ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నట్లు తెలిపారు. దాడుల్లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, ఇన్‌స్పెక్టర్లు ఎల్‌.రాజు, ఎస్‌.రాజు, శ్యాంసుందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

దండించడమే కారణమా?

వారం రోజుల క్రితం నల్లబెల్లం వ్యానును పట్టుకున్న ఎస్సై వెంకన్న స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు మధ్యవర్తి ద్వారా రూ.70వేలకు అంగీకరించినప్పటికీ పట్టుబడిన వారిలో మైనర్‌ బాలుడు, మరో వ్యక్తిని తీవ్రంగా కొట్టినట్లు సమాచారం. దీంతో సదరు మధ్యవర్తి.. ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిసింది.

రూ.40వేలు లంచం

తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement