ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం

May 25 2023 1:28 AM | Updated on May 25 2023 1:07 PM

- - Sakshi

హన్మకొండ: ప్రేమ విఫలమై రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని గోవర్దనగిరి రైల్వేగేట్‌ సమీపంలోని ట్రాక్‌పై బుధవారం చోటు చేసుకుంది. కాజీపేట జీఆర్పీ పోలీసుల, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని బాంజీపేట గ్రామానికి చెందిన దొంత సత్యనారాయణ–సావిత్రి దంపతుల కొడుకు శ్రీనివాస్‌ (25) రఘునాథపల్లిలో బైకు మెకానిక్‌ షాపు నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నాడు.

శ్రీనివాస్‌ కొంతకాలంగా ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నట్టు తెలిసింది. ఆ అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెంది శ్రీనివాస్‌ గోవర్దనగిరి రైల్వే గేట్‌ సమీపంలోని ట్రాక్‌పై గుర్తు తెలియని రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ విఫలం కావడంతోనే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు. కాజీపేట జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కాజీపేట రైల్వే పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జ్‌ అధికారి పరశురాములు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement