సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి | - | Sakshi
Sakshi News home page

సరస్వతీ నమస్తుభ్యం.. వరదే కామరూపిణి

Oct 17 2026 6:12 AM | Updated on Oct 17 2026 6:12 AM

శివాలయంలో సరస్వతీదేవిగా

భ్రమరాంబ అమ్మవారు

పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వారి దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారు శుక్రవారం సరస్వతీదేవిగా భక్తులను అనుగ్రహించారు. పెదకాకాని శివాలయంలో శ్రీదేవీ నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారిని సరస్వతీదేవిగా అలంకరించి పూజలు చేశారు. పెదకాకాని శివాలయానికి అధికసంఖ్యలో భక్తులు విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెల్లవారుజామున సుప్రభాతసేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు విఘ్నేశ్వరపూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, నవావరణార్చనలు జరిపించారు. అమ్మవారికి కుంకుమార్చనలు జరిగాయి. పులువురు భక్తులు ఆలయ యాగశాలలో జరిగిన చండీ, రుద్ర హోమాల్లో పాల్గొన్నారు. ఆలయ డీసీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం, సాయంత్రం ఉచిత అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. సప్తమి శనివారం అమ్మవారు లలితా త్రిపురసుందరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తారని ఉప కమిషనరు గోగినేని లీలాకుమార్‌, చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు, తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement