ఏపీ జేఏసీ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీ జేఏసీ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక

Feb 23 2026 7:37 AM | Updated on Feb 23 2026 7:37 AM

ఏపీ జేఏసీ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఏపీ జేఏసీ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక

నరసరావుపేట ఈస్ట్‌: ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (ఏపీ జేఏసీ) పల్నాడు జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రకాష్‌నగర్‌లోని ఎన్‌జీఓ హోమ్‌లో నిర్వహించిన సమావేశంలో జిల్లా చైర్మన్‌గా మర్లపాటి రామకృష్ణ, కో–చైర్మన్‌లుగా ఎస్‌.మురారి, కెఎస్‌కె షరీష్‌, బి.సంపత్‌బాబు, ఏ.ఏమండీ, వైస్‌ చైర్మన్‌లుగా ఎస్‌.సుబ్బారావు, ఉబేద్‌ బేగ్‌, పిఐజే మరియరాజు, ఎం.రామయ్య, జనరల్‌ సెక్రటరీగా ఎం.మోహనరావు, జాయింట్‌ సెట్రరీలుగా కె.ప్రతాప్‌కుమార్‌, సి.సి.ఆదెయ్య, ఎస్‌ కొండయ్య, ఏ.ఆంజనేయులు షేక్‌.కమల్‌బాషా, కె.బ్రహ్మాయ్య, కోశాధికారిగా కె.నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్‌జీఓ సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.రాజశేఖర్‌ పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే పీఆర్‌సీ కమిటీని ఏర్పాటు చేయాలని, 30 శాతం డీఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అలాగే పెన్షనర్ల అడిషనల్‌ క్వాంటం పెంచాలని కోరారు. ఉద్యోగ, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ చేపట్టే కార్యాచరణను విజయవంతం చేస్తామని జిల్లా కమిటీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement