‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి | - | Sakshi
Sakshi News home page

‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి

Feb 23 2026 7:37 AM | Updated on Feb 23 2026 7:37 AM

‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి

‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి

‘సమర శంఖారావం’ జయప్రదం చేయండి

ఎస్టీయూ పిలుపు

నరసరావుపేట ఈస్ట్‌: కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎస్టీయూ చేపట్టిన దశల వారీ ఆందోళనలో భాగంగా ఈనెల 25వ తేదీన చేపట్టిన చలో విజయవాడ సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐఎస్‌టీఎఫ్‌ జాతీయ ఆర్థిక కార్యదర్శి సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు, ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఎస్టీయూ కార్యాలయంలో సమర శంఖారావం పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు ఎల్‌.వి.రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని, అప్పటి వరకు 30 శాతం ఐఆర్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.34వేల కోట్లతో పాటు నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు యు.చంద్రజిత్‌యాదవ్‌, ఎం.వెంకటకోటయ్య, రాష్ట్ర కార్యదర్శి సీహెచ్‌.అనిల్‌, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ పి.సుశీల, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.ఏమండీ, ఆర్థిక కార్యదర్శి షేక్‌.మహబూబ్‌ సుభాని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement