ఐశ్వర్యాంబికగా బగళాముఖి | - | Sakshi
Sakshi News home page

ఐశ్వర్యాంబికగా బగళాముఖి

Feb 23 2026 7:36 AM | Updated on Feb 23 2026 7:36 AM

ఐశ్వర

ఐశ్వర్యాంబికగా బగళాముఖి

ఐశ్వర్యాంబికగా బగళాముఖి అమరావతిని సందర్శించిన ఒడిశా ప్రతినిధులు విజయకీలాద్రిపై ప్రతిష్టా మహోత్సవాలు

కర్లపాలెం: పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో వేంచేసియున్న బగళాముఖి అమ్మవారు ఆదివారం ఐశ్వర్యాంబిక అలంకారంలో పూజలందుకుని భక్తులకు దర్శనమిచ్చారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రదక్షిణలు చేశారు. పూలు, పండ్లు, పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించి పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

అమరావతి: ఒడిశా రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 37 మంది ప్రతినిధులు ఆదివారం అమరావతిని సందర్శించారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరుగుతున్న అంతర రాష్ట్రీయ యువ సమ్మేళనానికి హాజరైన వారు అమరావతిని సందర్శించారు. తొలుత ధ్యానబుద్ధ విగ్రహం, అమరేశ్వర ఆలయం, మ్యూజియంలను తిలకించారు. గుంటూరు మై భారత్‌ కేంద్ర జిల్లా ఉప సంచాలకులు దేవిరెడ్డి కిరణ్మయి మాట్లాడుతూ ఐక్యత, సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో సమ్మేళనం నిర్వహిస్తున్నామన్నారు. చారిత్రక, పర్యాటక పరంగా ఎంతో ఘన చరిత్ర కలిగిన అమరావతిని సందర్శించడం సంతోషంగా ఉందని ఒడిశా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. జనచైతన్య సమితి వ్యవస్థాపకులు దాసరి విజయ్‌బాబు, కోఆర్డినేటర్‌ వేలితోటి అనిల్‌ కుమార్‌, కెనరా బ్యాంక్‌ అధికారి బెజవాడ జయరావు, మై భారత్‌ అకౌంట్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ వడ్డాది పృథ్వీ, పేస్‌ సొసైటీ సెక్రటరీ పారుపల్లి రమేష్‌, షేక్‌ సుభాని, లియాకత్‌ అలీ పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరంలో ఉన్న విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ప్రతిష్టా మహోత్సవాలు ఆదివారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. జీయర్‌ ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ మేనేజర్‌ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్నజీయర్‌స్వామి వారి స్వీయ పర్యవేక్షణలో ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీభూనీల సమేత వైకుంఠ నాథ పెరుమాళ్‌, శ్రీ లక్ష్మీ హయగ్రీవస్వామి, శ్రీ యోగాంజనేయ స్వామి వార్ల ఆలయ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు సాయంత్రం శ్రీ విష్వక్సేనారాధన, పుణ్యాహావచనం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, సామూహిక ఉపనయనాలు నిర్వహించామని తెలిపారు. రెండవ రోజు ఆదివారం ఉదయం అగ్ని ప్రతిష్ట, యంత్ర స్థాపన, పంచగవ్య స్నపనం, అనంతరం సామూహిక ఉపనయనాలు, పూర్ణాహుతి, తీర్థ ప్రసాద గోష్టితో కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.

ఐశ్వర్యాంబికగా బగళాముఖి 
1
1/2

ఐశ్వర్యాంబికగా బగళాముఖి

ఐశ్వర్యాంబికగా బగళాముఖి 
2
2/2

ఐశ్వర్యాంబికగా బగళాముఖి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement